నేను కొరుకునేది ఒక్కటే నేస్తం..
నా అక్షరాలన్ని నీ అశ్రువులిని తుడవాలని..
నువ్వు ఆనందంగా నవ్వీతే ఆ అమృతతత్వాన్నీ..
నేను అందుకొవాలని..
నీశి తీరాలలొ నువ్వున్నప్పుడు..
చింతలతొ... చిరాకులతొ ..
తనువును సజీవంగా సమాధి చేస్తున్నప్పుడు..
సమరొత్సహాన్ని మోసుకుంటూ...నీకివ్వాలని..
ఉద్రేకపు తరంగాన్ని గుండెల్లొ నింపుకొన్న నీకు..
సమస్యల చీకట్లను చంపుతూ...మైత్రి దీపంగా వెలగాలని..
నిరాశ దూళీ క్రమ్మిన నీ తనువుని..
కష్టాలతొ ఎండిన గొంతుని..
విజయ సంకల్పంతొ నిండిన...శాంతి సుధలతొ తడపాలని..
నీ ఎకాంతంలొ...మౌన నిట్టూర్పుల నడుమ..
బాధలతొ...సల సల కాగే అశృవులను చిందిస్తున్నప్పుడు..
సనాతన పరిమళంతొ నిండిన స్వాతి చినుకునై...నీకు సేద తీర్చాలని..
తరగని దూరాన్ని దాటాలన్న నీ ప్రయత్నంలొ..
ఆటుపొట్లు నడుమ ...సాగే నీ పయనంలొ..
నిరాశను కలిగించే మైళ్ళురాళ్ళూ...ఆవిర్బవిస్తునే ఉంటాయి..
అవి...అశాంతి...అలజడుల ఆర్బాటపు చిరునవ్వులలొ నిగ్గు తగ్గి ..
సిగ్గుతొ మార్గ మధ్యలొ ఎక్కడొ మృత్యువుని వెతుక్కుంటూ..
గెలుపుని నీకు బహుకరిస్తాయి..!
ఆ బహుమానం నా మనసైతే...ఆ విజేత నువ్వే నేస్తం..!
3 Comments:
-
- Naresh said...
Saturday, 10 April, 2010Fentastic Reva ... its really gud lining and simply superbbbbbbbb....- దేవకీ said...
Saturday, 10 April, 2010నేస్తం గురించి వ్రాసిన మీ కవిత ... చాలా బాగుంది నేస్తం...- వామనరావు said...
Saturday, 10 April, 2010మంచి లైనింగ్ తొ చాలా బాగా వ్రాసారు... మీ పదాల అల్లీక చాలా బాగుంది