అలసట లేని పరుగుతొ...
ఆశ నిరాశల నడుమ రెపరెపలాడుతున్న ప్రాణ దీపాన్ని
కారుణ్యపు హస్తాలతొ కాపాడుకుంటూ...
అమ్మ ఒడిలొ చేరిన ఆరొజు...
కన్నా...కన్నీళ్ళెందుకురా? అంటూ...
చిత్రంగా తాను కన్నీరు పెట్టుకున్న వైనం నేడు సాక్షత్కరిస్తుంది...
కరిగిపొవడం తప్ప...కాఠిన్యం తెలియదు...నా పిచ్చి తల్లికీ..!
ఎన్ని దిగుళ్ళు నన్ను క్రూరంగా వేటాడాయో...
ఎన్ని చింతలు నన్ను వేదించాయో...
ఎన్ని నీడలు నన్ను భయపెట్టాయో...
ఎన్ని ముళ్ళు నా లేత గుండెలొ దిగబడ్డాయో...
అనుక్షణం నాకొసం తల్లడిల్లే...నీకు...ఏలా చెప్పను...!
గొరు ముద్దల తినిపించిన నీకు...
నే తిన్న వేదన ముద్దల గురించి ఎలా చెప్పను...?
నీ వెచ్చని కౌగిలిలొ నా కష్టాలను కరిగిస్తున్న నీకు...
చమరిన నా కళ్ల వెనుకున్న అగాధాన్ని ఎలా చూపను...?
మాటలు నేర్పిన అమ్మ...
నా మాటల్లొని మంటలను భరించగలదా...?
నాకే తెలియని ఈ విపత్కర పరిస్ధితుల నడుమ....
రేపు ... మాపుల కాలచక్రాలలొ నా జీవితం...
ఓ యుగంలా గడుస్తుంది...!
అందుకే కడుపులొ బడబాగ్నిని దాచుకొని...
చిరునవ్వుల నురుగులును చిందే కడలి నా తొబుట్టువని చెప్పుతుంటాను...!
నా మాతృమూర్తికీ...!
super