మనసుకి... మనసుకి... మధ్య ముడి పెట్టే మాంగళ్యంలొ...
మమతనురాగ బంధాలను చూడగలిగే వ్యక్తి కావాలి...


చెక్కిలి పై నిలిచిన కన్నీటి బొట్టులొ ... భారమైన పాత జ్ఞాపకాల మత్తుతొ...
చిరునవ్వుల భూగొళాన్ని చూడగలిగే వ్యక్తి కావాలి...


దుఃఖాన్ని ఎండగడుతూ.... రాగ ద్వేషలను ప్రక్షాళన గావిస్తూ....
ఆపదలొ సైతం నేనున్నానంటూ... వెన్నుతట్టి నిలిచే వ్యక్తి కావాలి....


మదిని కలచి వేసే భావలను కరిగిస్తూ...
మౌనంతొ విజయాలను సాదిస్తూ...గమ్యాన్ని జీవితంతొ కొలిచే వ్యక్తి కావాలి...


జ్ఞాపకాలను హత్తుకుంటూ...బాధలను దిగమింగుతూ...
రూపం లేని శత్రువుల పై... వికసిత హృదయాలతొ యుద్దం చేసే వ్యక్తి కావాలి...


అలుపు లేని గుండె చప్పుడును... ఆత్మవిశ్వాసంగా మారుస్తూ...
విర్రవిగుతున్న సమస్యల కల్లొల తరంగాల పై... సింహంలా శయనించే వ్యక్తి కావాలి...


ఆ వ్యక్తి ... నువ్వే కావాలి నేస్తం...! ఎందుకంటే....
మనిషంటే ఆరు అడుగుల జడత్వం కాదు... అరవై కేజిలా నిశ్శబ్దం కాదు....


ఎల్లలు లేని సువిశాల ఆకాశం...అత్యంత విలువైన బహుమానం....
మధుర బంధాల మహ సాగరం.... మనిషికున్న మానవత్వం...!

3 Comments:

  1. భార్గవి said...
    చాలా చాలా బాగుందండి
    దేవకీ said...
    రేవా ... మంచి భావంతొ చాలా బాగా వ్రాసావు...
    వామనరావు said...
    క్రొత్తదనంతొ చాలా బాగా వ్రాసారు

Post a Comment