అనురాగపు సిరాలొ ముంచిన నా కలం నేడు మూగబొయింది...
ఎందుకనొ ఏమో... అనావిష్కృత కావ్యాలు...
అనాదృత స్నేహ హాసాలు...
హస్తాలు లేని పొత్తిళ్ళలలొ శిశువులలా ...
నా అక్షరాలు మిగిలిపొయాయి...
బాధ్యతల వలయాల్లొ బందీనై...నాకు...
అందచేయని శుభాకాంక్ష కన్నా...
ఆలశ్యంగా అందించే ఆకాంక్షల్లొ...కాంక్షే...
మరింత మధురిమగా కనబడుతుంది...
ఆలొచనలు... సౌరభాల సంపంగి గుభాళింపుతొ ...
మొగలి పొదలొ విచ్చుకున్న కొద్దీ...
పరిమళాలు వియల్సిన జ్ఞాపకాలు...
మరపు పొరల్లొకి ఎలా జారిపొయాయో... నాకే తెలియదు...?
మది అంతరంగాల నడుమో...
లేక నా కవిత పుస్తకాల మధ్య...
ఉండటం మూలంగా నా జ్ఞాపకాలు...సువాసనను కొల్పొయాయేమో...?
వేళ్ళు నరుకున్న మొండి చేతుల్లొ ఉన్న వేణువు...
మదిని ఓదార్చ గలదేమో గాని...
నా ఆర్తనాధాన్నీ పాటలా ఎలా పాడగలదు...?
ఏ కన్నీటి చుక్క... ఏ గుండె దాహం తీర్చుతుందొ ఎవరు చెప్పగలరు...?
ఏ పుటలొ... ఏ నెత్తురు వాసనుందొ ఎవరు చూడగలరు?
రెప్పలు కత్తిరించుకున్న నా కళ్ళకు తెలుసు...
అతి భాషణల కృత్రిమ ... హరిద్వర్ణంలొ....
అంతరంగపు దిగులు నీలిమ ఎలాగుంటుందొ...!
5 Comments:
Subscribe to:
Post Comments (Atom)
అతి భాషణల కృత్రిమ ... హరిద్వర్ణంలొ....
అంతరంగపు దిగులు నీలిమ ఎలాగుంటుందొ...!
Nice lining... superbbbbbbbb