గతించిన గతం... నా గత స్మృతులన్ని మీటుతుంటే...
కనబడని కాలం నా కళ్ళ ముందే కనుమరుగవుతుంటే...
మది అంచుల్లొ దాగి ఉన్న మౌనం...
నిట్టూర్పుల సవ్వడిలొ కరిగి కన్నీరవుతుంటే ....
కనురెప్పలను కాగడాలుగా మారుస్తూ...
గుండెల్లొ ఆరని... నీ జ్ఞాపకాల చితిమంటలను ....
కొటి ప్రభాతకాంతులుగా మారుస్తూ....
ఆరిపొతున్న నా ఊహలకు... వెలుగులను నింపుతూ....
మరు జన్మలొనైన నాతొ పయనిస్తావని ఎదురుచుస్తున్నాను నేస్తం...!
తనువులొ నిండిన నీ ఆలొచనలను...ప్రతిక్షణం తడుముతూ ఉంటే...
ఛిద్రమైన నీ స్మృతి చిహ్నాలు... నిస్సహయంగా పలకరిస్తుంటే...
నిరంతరం అపజయాల వేడుకలను చూడలేక...
నా అంతర్మధనంలొ నలిగిపొతున్న ప్రాణం ఇక శెలవంటూ...
వెళ్ళి పొతుంది...నేస్తం!
ఇంతలొనే ఎప్పుడొచ్చాయో ... తెలియదు కాని...
వెన్నెంటి సొలిపొయే....ఈ రెండు కన్నీటి బొట్లు...
నిశ్శబ్దంగా వచ్చి చెక్కిలి మీద నుంచున్నాయి...నిస్సహాయంగా...!
3 Comments:
Subscribe to:
Post Comments (Atom)
వెన్నెంటి సొలిపొయే....ఈ రెండు కన్నీటి బొట్లు...
నిశ్శబ్దంగా వచ్చి చెక్కిలి మీద
నుంచున్నాయి...నిస్సహాయంగా...!
ఎంత అద్భుతంగా వ్రాసారు సార్.... మంచి భావంతొ చాలా బాగుంది... నా గత స్మృతులను గుర్తుకు తెచ్చారు....