నా కన్పిస్తుంది...


అంధకారమైన సముద్రం పై...


చంద్రాకారం వెలుగుతునట్లుగా...


మొండి చేతుల్లొ మానవత్వం...


మంటగలిసి పొతున్నట్లుగా...


దివ్య సీమను చూపే నేత్రాలు...


దిగంతాలకై వెతుకుతునట్లుగా...


ఆకాశపు వొంపులతొ ఉన్న కాలం...


పాతాళపు సొంపుల్లొ ఉన్న విధిని సాయమడిగినట్లుగా...


ప్రాణ సారం లేని అనుభవం...


పశ్చాత్తాపంతొ నా చుట్టు తిరుగుతునట్లుగా...


కాషయం కట్టుకున్న పుష్కర రేవులు...


పుణ్యస్నానమాడుతునట్లుగా...


తుషార బిందువులతొ తడిసిన మల్లేలు...


భగ్న హృదయాలను కలచివేస్తున్నట్లుగా...


ముల్లపై బ్రతుకుతున్న రొజాలు...


మృదు హసాన్ని సంతరించుకున్నట్లుగా...


ఆలొచన పాత్రలొ నిండిన ఈనాటి జ్ఞాపకాలు...


రేపటికి పాతవవుతున్నట్లుగా...


నుదుట నున్న కస్తూరి...


నవ వర్ణ చిత్రాల ఊర్వశిలా విహరిస్తున్నట్లుగా...


మౌనంతొ కలిసి నగ్నంగా నిదురిస్తున్న నిశ్శబ్దం...


నీ మాటతొ ఉల్కిపడినట్లుగా...


రేపటి కొసం ఉదయం...


ఈ రొజే వెలుగును సమకూర్చుకుంటునట్లుగా...


మనొవాంఛ తీరక ముందే ...


మరణమొచ్చి రమ్మంటున్నట్లుగా...


ఎందుకొ నాకన్పిస్తుంది నేస్తం...

4 Comments:

  1. Hima bindu said...
    very nice
    Nancy said...
    Nice one.......
    Anonymous said...
    Good attempt... keep rocking
    Unknown said...
    బుజ్జి గారూ...,నా కన్పిస్తుంది...అంధకారమైన సముద్రం పై... చంద్రాకారం వెలుగుతునట్లుగా...మొండి చేతుల్లొ మానవత్వం...మంటగలిసి పొతున్నట్లుగా...దివ్య సీమను చూపే నేత్రాలు...దిగంతాలకై వెతుకుతునట్లుగా...ఆకాశపు వొంపులతొ ఉన్న క_____________________ఆసక్తికరంగా వుండి చక్కగా పండింది. తాజా సమాచారం కోసం ప్రతీ రోజు మీ పోస్టులు చదువుతాను

Post a Comment