ప్రభాత సముద్రం పై కురుస్తున్న వెన్నెలలా...
నెత్తురు చల్లబడే చలిలొ...
తనువు తియ్యని స్పర్శ కొరకు తపిస్తుంది...
కన్నెమనసులొ కొటి కాంతులతొ నిండిన సరి కొత్త కాంక్షని ప్రేరేపిస్తుంది ...
పరువానికి వచ్చిన వయస్సు విరహంతొ రగిలిపొతుంది...
హృదయం స్వగతాలతొ కుంగిపొతుంది...
యౌవన భారంతొ...తనువు విరుచుకుపడుతూ...
శార్కరములతొ కడిగిన అధరాలకు సుధలు నింపుతూ...
కైపు నిండిన కంటికి కాటుకనద్దుతూ...
పగలు పూచిన మల్లెచెండ్లులను రాత్రికి పొగు చేసి...
శంకాకులమైన రాత్రిలొ...
సగం కాలిన అగరువత్తుల మత్తులొ...
సన్నగా ప్రసరిస్తున్న దీప శిఖ నీడల నడుమ...
సుతారపు సువాసన నిండిన అత్తరును పూసుకొని...
మది ఏకాంత సరస్సున తొలి కొర్కెను మెల్కొలుపుతుంది...
వలపు తెరల సందుల నుండి...
సౌందర్యపు పరిమళంతొ వీచే హేమంత సమీరాలు ఒంటిని నిమురుతూ...
మౌనంతొ కదులుతున్న కాలాన్ని ఊహల లతలతొ బంధీస్తూ...
కవ్విస్తున్న బుగ్గలపై సిగ్గులు చిందిస్తూ...
తలపుల రవికలొ దాచుకున్న...
తళుకులతొ నిండిన కలల పుప్పొడిని...
తొలిరాత్రిలొ వెదజల్లాలని...
పద్దెనిమిదేళ్ళ పడుచుదనాన్ని భద్రంగా దాచి...
పళ్ళెరంలొ పెట్టి... ప్రాణనాధుడి కందించాలనే ఆశ.....
తళుకులతొ నిండిన కలల పుప్పొడిని...
తొలిరాత్రిలొ వెదజల్లాలని...
పద్దెనిమిదేళ్ళ పడుచుదనాన్ని భద్రంగా దాచి...
పళ్ళెరంలొ పెట్టి... ప్రాణనాధుడి కందించాలనే ఆశ.....
సూపర్...ఈ లైనింగ్స్ చాలా చాలా బాగుంది... కవితలొ భావం అద్భుతంగా ఉంది