పగలుకీ..రాత్రికీ...మధ్య సరసాల అంచుదగ్గర...


విరహల...కొరికతొ.. మోకాళ్ల పైకి మడతపడిన లంగా


నిద్రలొనే సవరించుకుంటూ...కలలొ...కుర్రవాడి కౌగిలికి


సంశయిస్తూ...సమ్మతిస్తున్న...పడుచు పిల్లలా ఉందేంటీ ప్రకృతి...!


మంచు తెరలలొ తడిసిన చీకట్ల నడుమ...


అందానికి...యౌవనానికి...అవధిగా ఉంటూ...


అనుభూతి ...అస్ధిత్వం... సౌందర్యం...అధికం చేస్తూ...


చంద్రవంక విరిగి... పుడమి కట్టుకున్న తెల్ల చీర పై...


పుప్పుడులు రాలుస్తున్నట్లుందేటి ఈ రాకాసి వెన్నెల...!


తులసి కొట చుట్టు ఆనందపు దీపాలు వెలిగిస్తూ...


ప్రార్ధనాంతరం ప్రశాంత ప్రవిత్రతొ నున్న రాత్రిని...


రంపం పెట్టి కొసినప్పుడు రాలిన పొట్టులాగుందేంటి...ఈ వేకువ...!


చంధస్సు చీర కట్టి...భావం నిండిన రవిక తొడిగి ...


అలంకారపు కుచ్చిలతొ ముస్తాబవుతూ...


నిఖరమైన నెత్తుటితొ నిండిన సింధూరాన్ని కలంలొ నింపి ...


పలుచటి నా గుండె కాగితాల పై...


వొంపు సొంపులతొ జారవిడుస్తున్న అక్షర సుమాలన్నీ...


కవిత కన్యల్లా మారాయేమిటి...!


ఈ దిగ్ర్భాందపు ఆలొచనల హొరు ఏమిటి ...?


అణుక్షణం అతిశయం అన్పించే...


ఈ వర్తమానపు ఊహలేమిటి...?


నిలువనివ్వవూ...నిష్ర్కమించవు...!

5 Comments:

  1. దేవకీ said...
    పగలుకీ..రాత్రికీ...మధ్య సరసాల అంచుదగ్గర...
    విరహల...కొరికతొ.. మోకాళ్ల పైకి మడతపడిన లంగా
    నిద్రలొనే సవరించుకుంటూ...కలలొ...కుర్రవాడి కౌగిలికి
    సంశయిస్తూ...సమ్మతిస్తున్న...పడుచు పిల్లలా ఉందేంటీ ప్రకృతి...!

    ఎంత అద్భుతంగా వర్ణించారు ... నిజంగా మీకు నా అభినందనలు
    నిరంజన్ said...
    మీ ప్రతి ఉపమానం... ఓ అద్భుతం... మీ ప్రతి కవిత... ఓ స్ఫూర్తి...
    అశొక్ said...
    చాలా చాలా బాగుందండి... మీ కవిత
    Anonymous said...
    Excellent ......
    Anonymous said...
    Nice

Post a Comment