నా భావం... నా భాష్యం...నా హస్యం... నా లాస్యం.. అన్నీ నీవే...
Posted by బుజ్జి at 5/05/2010 06:05:00 AMనా ఆశల తీరం నువ్వు ఇంకా దాటలేనట్లుంది కాబొలు...
గుండె గుబులుతొ... మేఘంలా గర్జిస్తుంటే...
మది మసకబారుతూ... ముసురు కమ్ముకుంటూ....
రెప్పల చూరు నుంచి కళ్ళూ అదే పనిగా వర్షిస్తున్నాయి...
బాధ చిన్నదైన ...జ్ఞాపకాల దొంతర్లన్నీట్ని
వెతకాల్సి వస్తుంది నేస్తం... దాని మూలలా కొసం...
నా ఆత్మ సంచరించగల విశ్వాంతరాల పరిధిలొ...
ప్రబంధ బంధానివి నువ్వైతే నాపై దయ వర్షించు...
ఆనందపు నిర్లిప్తతొ నిండిన నా మనసు పైచందొ చర్చిత పద్యనివైతే...
ఆనందాశ్రుమిళితానుభూతిని నాపై కురిపించు...
మూగ సైగలతొ నీ నవ్వుల హరాన్ని నా అంతరాత్మకి
బహుకరించిన మధుర లలిత లావణ్యానివైతే...
ఉల్లాస శొకతప్త గేయమై నా రెప్పల మాటున దాగినకన్నీటిని హరించు....
ఎందుకంటే...
నా భావం... నా భాష్యం...
నా హస్యం... నా లాస్యం..
అన్నీ నీవే కనుక...
ఇది ముమ్మాటికి నిజం నేస్తం...!
5 Comments:
Subscribe to:
Post Comments (Atom)
గుండె గుబులుతొ... మేఘంలా గర్జిస్తుంటే...
మది మసకబారుతూ... ముసురు కమ్ముకుంటూ....
రెప్పల చూరు నుంచి కళ్ళూ అదే పనిగా వర్షిస్తున్నాయి...
బాధ చిన్నదైన ...జ్ఞాపకాల దొంతర్లన్నీట్ని
వెతకాల్సి వస్తుంది నేస్తం... దాని మూలలా కొసం...
అబ్బా ఎంత అద్భుతంగా వ్రాసారు... చాలా చాలా బాగుంది సార్.... సూపర్...