లొకం గాఢ నిద్రలొ...


చీకటి దీనంగా పలవరించె సమయాన...


ఉషాగమనాన్నిగుర్తించి...


స్వాగతమిచ్చే వైతాళికుడు... శ్రీ శ్రీ...


నవ ప్రపంచ నిర్మాణ కర్తల ఉత్సాహంతొ...


మానవ జాతిని ఉద్ధరించడానికి కొత్త మతాన్ని కనిపెట్టిన


చిరునవ్వుల ప్రవక్త...శ్రీ శ్రీ..


కళాచతురులమల్లే...


అందాన్ని దూరం నుండి చూసి సంతొషిస్తూ...


సహజ సౌందర్యం తక్కువైనప్పుడు...విచారిస్తూ...


మౌనాన్నీ...కార్యాన్నీ..విజయాన్నీ..


కఠిన పదాల బురఖాలొ...దాస్తూ...


మాటల్ని కత్తులుగా మారుస్తూ...


పదాలను తుటాలుగా వాడుతూ...


హృదయోద్రేకంతొ ఉంప్పొంగించే తెలుగు భగీరధుడు...శ్రీ శ్రీ...


అతనివి అక్షరాలు కావు...ఉద్రేకాలు...


బాధలు కావు...యుద్ధాలు...


కవితామృతానికి జీవన వాస్తవికతల హాలాహాలాన్ని జొడించి...


అదృష్టాధ్వం సమకూరిన అగాధ బాధా పాధ: పతంగాల


ఆక్రందనల్ని అలకించిన వాడు...


కవితా పారయణం చేసిన నిత్య యౌవ్వనుడు...శ్రీ శ్రీ...


కలాన్ని ఉలిగా చేస్తూ...


హృదయాల మీద మగత పెంకులు పగలగొడుతూ...


జడత్వ...మూఢత్వాలను చేధిస్తూ...


జన జీవితాలపై వెలుగు తెరలను నింపిన అగస్త్యుడు...శ్రీ శ్రీ...


మా గురువు గారైనా శ్రీ శ్రీ గారికి అంకితం చేస్తూ మీ రేవా...

5 Comments:

  1. పవన్ said...
    మీ కవిత చాలా బాగుంది... మీరు చెప్పిన ప్రతి పదం... అక్షర సత్యం...మీరు అంత గొప్ప వాళ్ళు కావాలని ఆశిస్తున్నాను....
    డేనీ said...
    మీ గురువు గారు కాదు నేస్తం... మన అందరి గురువుగారు... చాలా బాగుంది... సూపర్...
    Anonymous said...
    చాలా బాగుంది... శ్రీ శ్రీ గురించి చాలా అద్భుతంగా వ్రాసారు...
    Anonymous said...
    Superrrrrrr and fenstastic....
    Anonymous said...
    He is my god... and everything.... Nice attempt...

Post a Comment