వస్తావో..రావో..తెలియని సంధి ఆలొచనల నడుమ...
నువ్వు రావాలనే సరికొత్త ఆశల తీరాల మధ్య...
నన్ను మబ్బులా కమ్మేసే...
మధురమైన నీ ఊహలలొ పరవశిస్తూ...
నీ కొసం...నీ జ్ఞాపకాల అసరాతొ సాగుతున్నాను...!
అందం తాకని అంబరానికి వర్ణాలేన్నొ అద్దావు...
ఈ సంధ్య ఇలాగే ఉండిపొనీ నేస్తమా...!
చలనం లేని గుండెలొ కాంక్షాకిలల్ని వెలిగించావు...
ఈ కాంతి లతాంతాల్ని అలాగే నిలిచిపొనీ మిత్రమా...!
శిధిలమైన సంబంధాన్ని ధ్వంసం చేయకుండా...
నూతన సంబంధాల్ని ఎలా పేనగలం...?
గాయపడకుండా...దగ్ధమవకుండా...
అగాధ లొతుల్లొ మునిగి తేలకుండా...
ఎలా ప్రేమించగలం..?
నీవు రాని నిశీధులు...
నా నిదురకు నీషేదాలని ఎప్పుడు తెలుసుకుంటావు...
నిర్లిప్తంగా వెళ్ళిపొయే నిన్ను చూసినప్పుడు...
నీ జ్ఞాపకాలు...నా ఆశల తీరం వదలి...
అంతరంగపు సముద్రంలొకి జారిపొతున్న చప్పుడు...
ఇప్పటికి ఇంకా విన్పిస్తూనే ఉంది నేస్తం...!
వందల వేల శిశిరాల్ని దాటకుండా
ఒక వసంతం కొసం కలలు కనడం అవివేకం అని తెలుసుకున్నాను...
నా మనసులొ మాట...
నీకు చెప్పాలని ప్రయత్నించిన ప్రతిసారి విఫలమౌవుతున్నాను...
నీకు దూరంగా ఉండాలని ప్రయత్నించిన అనుక్షణం ఓడిపొతున్నాను...
4 Comments:
-
- నర్మద said...
Thursday, 06 May, 2010విషాధపు కవితలు... మీలా ఎవ్వరు వ్రాయలేరేమో... ఇతి అతిశయోక్తి కాదు... నిజం..- దేవకీ said...
Thursday, 06 May, 2010చాలా బాధతొ నిండినది... ఎదొ నా జీవితంలొ కొల్పొయినది... గుర్తుకు వస్తుంది...- శేఖర్ said...
Thursday, 06 May, 2010చాలా బాగుంది- Anonymous said...
Thursday, 06 May, 2010Its very painful and heart touching