గుక్క తిరగని ఏడ్పులతొ...
కారిపొతున్న కన్నీరు మీద...
తడబడే పాదాలతొ...నత్త నడకలు నడుస్తూ...
ఎడతెగని దిగులును అలింగనం చేసుకుంటూ...
ఎంత కాలం ...ఇలా నేను ?
అనురాగం... ఆత్మీయత కలబొసిన మమతతొ...
మానవతలను మేళవించిన ఈ వనితని...
ఆ దేవుడు ఇచ్చిన కానుక అనుకున్నాను ...
కానినువ్వు మాత్రం...
కన్నీరే ఎండిన కనులే నాకుంటే...
కనులే దాటని నీ కలలను చూడమంటున్నావు...
వేకువే ఎరుగని రేయి ఒకటుంటే....
వేదనే తరగని నీ ఆవేదనని కనమంటున్నావు...ఇది న్యాయమా...!
వరమే పొందని నా తపముతొ...
నా ఆశలు ఆరిన మనసులొ...
గాయాలు మానిన మనిషిగా మారుతూ...
కనీకారం లేని ఈ కలతలను చేధిస్తున్నాను...
మజిలీ... మజిలీకి అలసిపొతూ...
రేపటి ప్రధమ సూర్యోదయాశ్లేషం కొసం... అన్వేషిస్తూ....
ఈ వేళ వెలుగుల్ని సమకూర్చుకుంటున్నాను....
ఇవ్వన్నీ నీకొసం కాదా నేస్తం...!
5 Comments:
-
- కెక్యూబ్ వర్మ said...
Wednesday, 05 May, 2010బాగుంది...- సరస్వతి said...
Thursday, 06 May, 2010బాగుంది బాబు... మీ కవిత... మంచి భావంతొ నిండి ఉంది.- హేమ said...
Thursday, 06 May, 2010చాలా బాగుంది- వంశీ said...
Thursday, 06 May, 2010ఇప్పటి వరకు.. మీ బ్లాగ్ లొ కవితలు అన్ని చదివాను.. చాలా చాలా బాగున్నాయి...- Anonymous said...
Thursday, 06 May, 2010Fentastic Boss... superbbbbbbbb Poems in your blog...
Subscribe to:
Post Comments (Atom)