జీవితంతొ ప్రతి రొజు ఘర్షణ పడుతునే ఉంటాను...


మనస్సున్న మనిషిగా బ్రతకనివ్వమని...!


దేవుడికి ప్రతి నిమిషం ప్రార్ధిస్తునే ఉంటాను...


మానవత్వం ఉన్న వ్యక్తిగా ఎదగనివ్వమని...!


విధితొ అనుక్షణం విలపిస్తునే ఉంటాను...


గొంతులొ నీళ్ళు ఇంకిపొయినా...


కంటిలొ నీళ్ళు మిగిలే ఉన్నాయని...


అవే నా ఆశల సముద్రాన్ని బ్రతికిస్తాయని...!


కక్ష కడుతున్న కాలాన్ని ప్రశ్నిస్తునే ఉంటాను....


అప్యాయత ... అనురాగాల మధ్య...


హంగులు... ఆర్భాటాలు ... ఎందుకు సృష్టిస్తున్నావని..?


నిరంతరం కుసుమాలును ఓదార్చుతునే ఉంటాను....


విసిరిన పూలు వాడిపొతే ఏంటీ ...


గుభాళిస్తున్న పరిమళాలుగా గుర్తుండిపొతారని...!


వేదనని వేడుకుంటునే ఉంటాను....


మౌన నిశ్వాసాల్ని వీడి...నవ విశ్వాసాల్ని మాలొ పెంపొందించమని....!


నీ గురించి ఆలొచిస్తుంటాను...


నాలొ నువ్వు సగం ... నేను సగం అన్నావు...


నాలొ నువ్వు లేని మిగత సగం ... నాకు మాత్రం ఎందుకని..!

5 Comments:

  1. శ్రీనివాసరావు said...
    నాలొ నువ్వు సగం ... నేను సగం అన్నావు...
    నాలొ నువ్వు లేని మిగత సగం ... నాకు మాత్రం ఎందుకని..!

    చాలా బాగుంది సార్... సూపర్
    నిర్మల said...
    మీ కవితలు చాలా చూసాను... ప్రతిది చాలా చాలా కొత్తగా వ్రాస్తున్నారు... సూపర్ సార్
    దేవకీ said...
    చాలా అద్భుతంగా వ్రాసారు
    రాజా said...
    మంచిగా ఉంది
    Unknown said...
    thanu leni,naloni migatha sagam bathiki unna savam.wat u said is right. chala bagundi

Post a Comment