నన్ను నిర్బంధించకు నేస్తం...


ఈ రాత్రిని ఇక చూడలేను...


కృత్రిమ వేషాన్ని అభినయింపలేను..


మానవత లేని లొకాన్ని స్తుతింపలేను...


మానవునిగా శిరసెత్తుకు తిరగలేను...


ఈ నాగరికతారణ్యవాసం భరించలేను...


ఒక్క నిరుపేద వున్నంతవరకు...


ఒక్క మలినాశ్రు బిందు వొరిగినంత వరకు....


ఒక్క ప్రేగు ఆకలి కనలినంత వరకు...


ఒక్క శుష్కస్తస్య సన్నిధిని క్షుధార్తి నేడ్చు పసిపాప ఉన్నంత వరకు....


ఒక్క తల్లి నీరవాక్రొశ రవమ్ము విన్నంత వరకు...


ఒక్క క్షత దు:ఖిత హృదయ మూరడిల్లనంత వరకు...


నాకు శాంతి కలగదింక నేస్తం... నేను నిగర్వినైనాను...


ఈ సిగ్గులేని ముఖాన్ని చూపించలేను...


ఈ గుండె గూడుపట్లు ఎక్కడొ కదలినవి...


ఈ కనులు వరదలై పారినవి...


ఈ కలలు కాగితపు పేలికలై రాలినవి...


ఈ ఆర్తి ఏ సౌధాంతరాలకు పయనించగలదు...?


ఏ రాజకీయవేత్త గుండెలను స్పృశించగలదు?


ఏ భొగవంతుని విచలింప చేయగలదు?


ఏ భగవంతునికి నివేదించు కొనగలదు...?

2 Comments:

  1. priya said...
    nee kavitha lo maro sri sri ni neenu chsuanu...
    Padmarpita said...
    చాలా బాగారాస్తున్నారు!

Post a Comment