ఎసెమ్మెస్ లు వెళ్ళుతునే ఉన్నాయి...

కీ బొర్డుపై వేళ్ళు కదులుతునే ఉన్నాయి...

ఈమెయిళ్ళు ఇంకా పూర్తి కాలేదు...

నైట్ పార్టీల మజా ఇంకా తీరలేదు...

పబ్బుల్లొ పరిచయాలు పెరగలేదు...

వెబ్బుల్లొ వెలుసుబాటు ఇంకా చిక్కనేలేదు...

ఎన్ని పనులు... ఎన్నీ వ్యాపకాలు...

గుండెలను హత్తుకున్న ఏడాది అనుభుతులను

తడిమి చూస్తే...ఏం మిగిలింది...?

2010 కాలింగ్ బెల్ కొడుతుంటే....

2009 తలుపుతీస్తూ... కరిగిపొయింది...

కాలం వేగమే అంత...! మా యువత ఉడుకు రక్తం ఉరకల్లాగ....!

ఎన్ని సాధించిన... ఇంకా ఎన్నొ మిగిలున్నాయి...

కొత్త ఎడాది స్వాగతానికి ఆశల తొరణం కట్టాలి...

ఆశయాల గుమ్మం ముందు... లక్ష్యాల ముగ్గులేయాలి...

సరదాల మధ్యనే విజయం సాధించాలి...

వ్యక్తీగా ఎదగాలి...సంఘమై సాగాలి...

ఎంచుకున్న దారి సరైందైతే....

లక్ష్యం చేరకుండా ఎవరూ ఆపలేరు...

ఆత్మవిశ్వాసాన్ని ఊపిరి నిండా నింపి...

ఆగని కాలనికి ఆనందాలను అద్దుదాం...

"నూతన సంవత్సర శుభాకాంక్షలతొ.... మీ రేవా"



గుండెల్లొ బాధ ఆకాశాన్నంటితే ఏం లాభం...అంతా శూన్యం...


ఎండిన కనుపాప తిరిగి వర్షిస్తే ఏం లాభం...అంతా ఆర్ధ్రతమానం...


నీ విరహపు వేడిలొ ద్రవీభవిస్తున్నాను...


నీ వలపుల నీడలొ ఘనీభవిస్తున్నాను...


నీ సుమధుర జ్ఞాపకాలను ఆస్వాదించేది నేనే...


నీ చుర కత్తుల చూపులతొ ఆక్షేపించబడేది నేనే...


జ్ఞాపకాల విలాసంలొ దుఖ: వెచ్చటి కంబళై కౌవ్విస్తుంటే...


బంధనాలు తెంచమని నిన్ను అడిగేదేలా...?


విధి వైపరిత్యంలొ నీ ఎడబాటు సైగలతొ గుండెను మండిస్తుంటే....


ప్రాణ రక్షణకై నీ చిరునవ్వుల హస్తాన్ని అడిగేదేలా...?


నా ప్రతి ప్రశ్నకి ఒకటే వైనం... అదే మౌనం...


మనశ్శాంతి కొ దృక్పధం....మరణం నాకు ఔషదం...



గతం నువ్వై తాకుతుంటే....నా చితిని నేనే చూస్తున్నట్లుంది...

బ్రతికిన కాలంలొ మధుర క్షణాలను వెతుకుతుంటే....

విధి నీతొ గడిపిన నిమిషాలనే గుర్తుచేస్తుంది....

నీ జ్ఞాపకాలను వేదన సిరాగా నాపై చల్లుతుంటే....

శ్వాశ మరిగి గుండెపై తపన పెంచుతుంది....

ఎడబాటుల నీరిక్షీణలొ నిన్ను శొధిస్తుంటే....

వెతికి అలసిన కళ్ళు స్వేదాన్ని చిందిస్తుంది....

ఒక ప్రక్క హృదయం నిట్టూర్పు తొ వాడుతుంటే....

మరొ ప్రక్క ఆత్రుతతొ నీ తలపులు వికశిస్తున్నాయి....

నా కష్టాలకు శత్రువులా... సుఖాలకు సంపన్నురాలిగా... నిలుస్తావనుకున్నాను....

కాని

కారణాలు లేకుండ వెడలిన నిన్ను చూస్తుంటే...

తొరణాలను లేని నా హృదయ వాకిలి ప్రస్పూటిస్తుంది....

మౌనంతొ మరలుతున్నాను....మళ్ళీ నీకు కన్పించకూడదని....

శెలవు నేస్తం....



హృదయాకాశంలొ వెలిగే చిరునవ్వుల సౌగంధం... సంధ్య...
లలిత రాగాల సుమగంధం...కుడి ఎడమల కుసుమ పరాగం... సంధ్య...

మెరిసే నక్షిత్రం... కురిసే వెన్నెల... విరిసే కలువ... పూచే కుసుమం... సంధ్య...

చుక్కల వెలుగుతొ సౌందర్య లొకాలను వెలిగించే హరిత వర్ణాల అందం ... సంధ్య ...

కలల ఆకులపై కురుస్తున్న మంచు బిందువుల సొయగం... సంధ్య ...

ఉషస్సులతొ చీకటిని హరిస్తూ...తన్మయంతొ ఉప్పొంగే భావ కెరటాల వెల్లువ... సంధ్య...

యుగాలని... తరాలని మింగేస్తూ...అనంతానంతగా సాగిపొయే చెలిమి... సంధ్య...

సెలయేరు సొగసులతొ....జలపాతాల రాజసంతొ... జన హృదయాలలొ ప్రవహంచేది... సంధ్య...

తడారిపొయిన కలల ఎడారిలొ చిరుజల్లులను కురిపించే రంగుల హరివిల్లు... సంధ్య...

అధరాలపై కదులుతున్న అస్ధిత్వమైన అక్షరాలకు సరికొత్త అర్ధం... సంధ్య...

ఏకాంతంలొ...మనసు పొరలలొ అలసి...సొలసి...అల్లుకున్న ఆశల అన్వేషణ ... సంధ్య ...

నిశేదిలొ తళ్ళుక్కు మనే తారా దీపం... బ్రతుకు వాకిట నవ్వులు రువ్వే వెలుగు తొరణం... సంధ్య...

ఆశయ సాగర మధనంలొ అమృతతుల్యానికి ప్రతీక ... సంధ్య ...

గడిచి పొయిన జ్ఞాపకాలను కళ్ళ ముందు నిలిపే సుంధర స్వప్నం ... సంధ్య...



ప్రకటన మౌనవ్రతం నడుమ కేంద్రం దొబూచులాడుతుంటే....

ఆందొళనలు... భయందొళనల నడుమ రాష్ట్రం 'బంద్' ఖానా అవుతుంది...

ఆశ... నిరాశల మధ్య ఆంద్రావని కేంద్రం వైపు మోర చాపి చూస్తుంది...

సీమాంధ్రలొ రగిలిన నిరశగ్ని చల్లారలేదు సరి కదా...

నాయకులు దాయదులై భరతమాతను పంచుకుంటున్నారు....

ఒక చొట దీక్ష శిబిరాన్ని భగ్నం చేస్తే... మరొచొట వెలుస్తొంది...

ప్రజల జీవితాలతొ పేకాడే ప్రవృతి పార్టీల్లొ పెరిగిపొయింది...

మొదట చేసిన బాసలను తూచ్ అనడం పరిపాటైపొయింది...

నీతి భాహ్యమైన తీరు నగ్నంగా ప్రజలందరికి కనిపిస్తుంది...

విసిగిపొయిన యువత....లాఠి దెబ్బల తిన్న విద్యార్ధుల మదిలొ...

నిండిన ఆత్మవిశ్వాసం నేడు ఆత్మహుత దాడుల్లొ అంతమవుతుంది...

ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే మేధావులు ఇప్పుడు ఏమయ్యారు...?

పరిష్కారాన్వేషణలొ పాలు పంచుకుంటున్నారా...! లేక

టివీల్లొ షొ కొసం నీరాహర దీక్షల్లొ తలమునకలవుతున్నారా...!

రాజకియాన్ని ఆటలా మర్చేస్తూ....

భావొద్రేకపు ఉద్యమాల సంద్రంలొ అమాయక ప్రజలను తొసేస్తూ...

మానవ జీవితాన్ని భస్మం చేస్తున్నారు...

నెహ్రు ఆశలకు భిన్నంగా ఎర్రరంగు పావురాలను ఎగురవేస్తున్నారు...

బాపుజీ కలలు కన్న దేశం ఇదేనా?

ప్రజల ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించేదెప్పుడు...

క్రొసులకొద్ది నడిచిన నా అంతరంగంలొ ఈ జ్వాలలు చల్లారేద్దెప్పుడు...


ఓ నిర్వేదం...ఒక నిట్టూర్పు...నిర్లిప్తమైన క్షణానికి కారణం...నీ జ్ఞాపకం...


నీ పరిచయం ముందు...సారం లేని బ్రతుకు శబ్ధనికి...సారాంశం లేని నిశ్మబ్ధాన్నీ...


కాలపు ఉద్వేగంలొ...విధిచే నేట్టేయబడ్డ...ఓ జీవం ఉన్న నిర్బేధ్యుడినీ...


నా మౌనాన్ని నీ చూపుల శృతితొ జతచేసి నీ చెలిమికి అర్పించలేను...


హృదయాంతరాలలొ యుగాలుగా దాగిన నిన్ను...


ఒక్క కన్నీటి చుక్కతొ కడిగేయాలేను...


దుర్లభమైన...నీ ఎడబాటు సంద్రాన్ని దాటగలను కాని...


నీ అంతరంగపు సుశుప్తావస్ధలొ ఓలలాడుతున్న నా మదిని ఊరడించలేను...


నీ ఆలొచనలు...కడలిలొ అలలుగా మారి ...నా మది తీరాన్ని ఢీ కొంటున్నాయి..


నిర్వ్యామోహితమైన నీ కర స్పర్స కొరకు...


పగటి వేళ నా మదిలొ నీ రూపాన్ని పతాకొత్సవం చేస్తున్నాను...


అశృవులు నిండిన మగత చూపుతొ నిరాసక్తుడిగా...


రాత్రి వేళ నా అంతరాత్మలొ నీ తలపులకు చందనొత్సవం గావిస్తున్నాను...


హృదయం భావొద్రేకంతొ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న నీ వలపుల దృశ్యమానంలొ...


అలసి సొలసిన ఈ గొంతులొ మాటరాక గద్గదమవుతుంది...


గతంలొ నేను పారేసుకున్న నీ తలపుల అనుభూతులు...


భవిష్యత్తు లొనైనా దొరుకుతాయని ఆశతొ వెతుకుతున్నాను...



ప్రేమను పంచుతుంటే అందుకోనంటున్నావు....


మనసు లేని మానువా నువ్వు....


మనసు నీకు అర్పిస్తానంటే మౌనం వహించావు....


మాటలు రాని...ప్రాణం లేని రాయివా....


నీ హృదయం అనురాగం లేని శవమా?


నీ మనసు ప్రేమను పొందలేని శిల్పమా?


లేకనీ కన్నులు కోరుకునే అందం నాలో కనిపించలేదా?


ఐనా అందం కాదు నేస్తమా మదిని ఆనందింపజేసేది....


ఐశ్వర్యం కాదు ప్రాణమా మనసులు ఐక్యం చేసేది....


ఒక్కసారి నీ మనసుతో నన్ను చూడు....


నా ప్రేమ శికరంపై రాణిలా కూర్చున్న నీ రూపం కనబడుతుంది....


ఐనా ఏముందనే అంత పొగరు నీకు.....


మట్టిలొ కలిసిపోయే దేహన్ని చూసుకొని ఎగిరెగిరి పడుతున్నావు....


శాస్వతమైనా నా చెలిమి కాదని?



జ్ఞాపకాలు ప్రళయాగ్నిగా మదిని కాల్చేస్తున్నా....


చిరునవ్వులను పెదవులకు అద్దుకుంటున్నాను....


తలపులు జ్వాలలుగా గుండెని దహిస్తున్నా...


శరత్కాలపు శశిధరుడిచే వెన్నెల కురిపించుకుంటున్నాను....


కన్నీటిగోడలలొ ఎదురుగావున్న నీ రూపం మసక బారుతున్నా...


కరస్పర్సతొ కలవర పరుస్తున్న అశృవులని అంతం చెస్తున్నాను ...


స్వేచ్చయుత సంధ్యలా వెలిగిపొతున్న సూర్యుణ్ణీ కాను...


ఎరుపెక్కిన కనుపాపలొ రక్తఛారని చెరిపేయడానికి ....


అమాస్య చీకటితొ కుంగిపొతున్న చంద్రుడిని కాను....


పాదాలపై జారిపడ్డ కన్నీటి మెరుపుని తుడిచేయడానికి.....


శిశిరాలతొ నిండిన నీ మౌనం ... నా గుండెను గాయం చేస్తుంటే...


అంతరాలలొ నలిగిపొయే నీ భావం... నా తనువును చింద్రం చేస్తుంది....


స్నేహని వదులుకొలేక... ప్రేమను పొందలేక.... నేను....


ప్రేమను స్వీకరించలేక....స్నేహన్ని దూరం చేసుకొలేక... నువ్వు....


మౌనపు సంద్రానికి చేరొ ఒడ్దున నిలిచిపొయాము.....


నీ ఎడబాటుతొ కనుమరుగై పొతున్ననా అంతరంగపు అనుభూతిని....


నీర్లిప్తంగా సాగిపొయే నా గమ్యంలొ ప్రతిబింబించె నీ లాస్యాన్ని ఆస్వాదిస్తూ....


నిన్ను స్పందింపజేసే మార్గం కోసం వెతుకుతూ...నా ఈ అన్వేషణా.....



ఆకాశరాజు...భూమాత పై దండాయాత్ర ప్రకటించడా....అన్నట్లుగా


నీలిమేఘాలు అమ్ముల పొదలొ దాచుకున్న పన్నీటి జల్లులను...


అస్త్రాలుగా పడమి తల్లి పైకి సందిసున్నాయి...


చెట్లు తమవొంతు సాయంగా ఒంటిపైనున్న సలిలసుధలు రాలుస్తున్నాయి...


నిర్మలమైన నింగి... నిశబ్దంగా నల్లబారిపోయింది....


తమకేమి పట్టనట్లుగా...


నదులు నెరజాణల్లా హొయలొలుకుతూ సాగరసంగమం వైపు సాగుతున్నాయి...


ఇంతలోనే ....!!!


కాంతులీనే కొటితారలను సంకేతంగా పంపి....


మబ్బుల చాటునున్న చంద్రుడు... మేఘాలతో సంధి చేసుకున్నాడేమో...


కాంతి కిరణాలను నిర్మొహమాటంగా నలుదిశలా విరజిమ్ముతున్నాడు....


మరొ చల్లని చంద్రొదయంలొ వెన్నెల పరావర్తనం తాకి...వెండి కలువలు వికసిస్తున్నాయి....


నా పయనంలొ ఇలా ఎన్నొ దృశ్యాలు కన్పిస్తున్నాయి.....


కళ్ళార్పక చూస్తున్నా ...స్వర్గానికిపోయే జీవాత్మలా ..



పరాజితమైన నా చూపుల వెనుక పెను చీకటి సృష్టిస్తూ...

కాలం నిన్ను తన ఎదలొ దాచిందనుకున్నాను.... కాని

నీ తలపుల వేకువతొ నిండిన బ్రతుకును చమరిస్తూ.....

విధి ఈ రొజు విడిపొమ్మంటుందనుకొలేదు.....

ఎడబాటు కూటమి ఎడారులై... సేగలు రేపుతుంటే...

మదిలొ చినుకంటి చెలిమి దూరమై వేదిస్తుంది....

రాలిన కలల ఆకులపై కురుస్తున్న జ్ఞాపకాలతొ....

ఊపిరి కరువైన నా హృదయన్ని నీ ముంగిట వదిలేస్తున్నా....

కన్నీళ్ళ సంద్రాలుగా కొలువై నిండిన చీకటిలొ...

రుధిరంతొ నిండిన నా గుండెను నీ కర్పిస్తున్నా...

నిశ్మబ్ధ విచీకలొ నీర్లిప్తంగా నీతొ కలిపిన అడుగులను

ఈ జన్మకు వరం అనుకున్నా....

అంతరాత్మలొ నీ ఉనికి అనంతమని తెలుసుకొని... ...

తలవంచుకొని శూన్యంలొ పయనిస్తున్నా....

నీ కనుపాపలు వెతికే రూపం.. నేను కాదని తెలిసిన మరుక్షణం

దిగులుతొ చలిస్తూ...ఊహలతొ నిండిన మనసుని నీ దొసిలికి అందిస్తున్నాను....

పాదాలకడ్డం పడలేని ఉద్వేగాలు నీడలా వెంబడిస్తున్నాయి....

వేదనతొ వొణీకించే విషాదపు సాయంత్రాలు సందిగ్ధతలంపులతొ బంధిస్తున్నాయి...

నా హృదయ గతభావంలొ తేజొదీప లావణ్యంగా వెలిగిన నువ్వు...

నేడు నా దృష్యాంతంలొ పాలిపొయి.... నస్వరమైన దేహంతొసాక్షత్కరిస్తున్నావు....

చీ....నీదీ ఓ బ్రతుకేనా...



నేను జేబులలో అదృష్టాన్ని వేసుకుని రాలేదు.....

గుండెల్లొ సంకల్పాన్ని నింపుకొని వచ్చాను......


నా శరీరానికి సుఖాన్ని అత్తరుగా పూసుకొని రాలేదు....

కష్టాలా శిలువను స్వేదబిందువులతొ తెంచుకొని వచ్చాను....


గతాన్ని నా పిడికిళ్లలొ దాచుకొని....

గుర్రంలా పరుగు తీస్తున్న అలుపెరుగని ఆ కాలాని చూస్తున్నా....

రేపటి నా పయనం ఎటువైపని....


వెలుగు... విధితొ స్నేహమాడుతున్నట్లుంది ... అందుకే

నా జీవిత మార్గానికి దారి చూపలేకపొతుంది....


చీకటి... శూన్యాన్ని ప్రేమిస్తున్నట్లుంది... అందుకే

అసమర్ధుడిగా ఈ సమాజం ముందు నిలబెడుతుంది...


పదే పదే ఓటమి హొయలొలుకుతూ నేరజాణై నన్నుహత్తుకుంటుంది....

గెలుపు అస్వతంత్ర్యయుడిని చేస్తూ అంటరానివాడినని నిందిస్తుంది....


స్వర్గం... నరకంతొ సంధి చేసుకున్నట్లుంది.... అందుకే

సమస్యల సుడిగుండానికి పగలు ఏంటి... రాత్రి ఏంటని... చర్చించుకుంటున్నాయి...


ధైర్యంతొ కట్టుకున్న ఆశల సౌదాలును నేలకూలుస్తూన్నాయి...

మదిలొ ఆశయాలు నిశ్మబ్ధంగా నల్లబారిపొతున్నాయి....


ఎన్ని రాత్రులు గడిచినా ... ఎన్ని పొద్దులు పొడిచినా....

కాంతీ హీనుడిని చేస్తూ ఆనందాని నిక్కచ్చిగా దొచుకొవాలని ....

ఆకలి రాణి నాపై దండాయాత్ర చేస్తూనే ఉంది....

వర్షిస్తున్న చూపుతొ మరొ ప్రపంచం కొసం నా అన్వేషణ....



కదలని పగళ్ళూ..... కలత నిదురలు...

నిట్టూర్పు సెగలు... ఓదార్పులేని దిగుళ్ళూ...

ఎన్నాళ్ళిలా....?

జీవితం అంతా పొరాటం అయిన పర్వాలేదు.... ఓటమి అనుభవానిచ్చే ఆస్ధులని గుర్తుంచుకొ...

నీరాశ ఆకాశంలా కమ్ముకునా చింతలేదు.... ఆత్మసైర్ధ్యమే నీకున్న అంతస్తులని చెప్పుకొ...

వేదనలు చుట్టుముట్టినా బాధపడకు....నమ్మకముంటే నరకం కూడ స్వర్గంగా స్వాగతిస్తుంది...

ఆశయ సాధనలొ స్వార్ధం సరసమాడినా భయపడకు....ఆత్మవిశ్వాసముంటే అపజేయం కూడ ఆవిరవుతుంది...

గేలి చేస్తున్న కాలన్ని చూసి కన్నీరు కార్చకు....వేదిస్తున్న విధిపై పట్టుదలని పణంగా పెట్టు...

మనశాంతి కరువైందని విచారించకు... అది నీ మనస్తతత్వంలొనే దాగుంటుందని గ్రహించు...

ఎదలొ కష్టాలూ... ఎడారులై సేగలురేపితే ఏంటి...?

చేదు జ్ఞాపకాలు చెరసాలై బంధిస్తేంటి...?

సమస్యా వలయాన్ని థైర్యంతొ చేదించాలి...

అవమానాలను చీల్చుతూ... చిరునవ్వుల సౌగంధాలను మదిలొ నింపాలి...

తల్లడిల్లే గుండెపై గెలుపు జెండా ఎగరాలి... మీ రేవా...



రోజూ తాగి పారేసే మీ సిగరెట్ల ఖర్చులో

అర శాతమైనా నాకు సాయం చేయ్యండి...!


ప్రతి క్షణమూ మీ సెల్ తో పలకరించే

మీ శ్రేయోభిలాషి కాల్ ఖర్చులో ఒకటో వంతు నా కొరకు విదిలించండి!


మీ గర్ల్ ఫ్రెండ్ తో షికారుకయ్యే పెట్రోల్ ఖర్చులో

ఒక చుక్క విలువను నాపై కార్చండి!


మీరు తిని పారేసే కాగితపు పొట్లాలలో

మిగిలింది ఏరుకోవడానికి నేనిప్పుడు

ఒక అంతరాష్ట్ర యుద్ధాన్నే చేస్తున్నాను !


రైలు బండిలో మీ సీట్లకింద బుగ్గిని

తుడిచే పిలగాడినీ నేనే....!


మీ ఎంగిలి ప్లేట్లను కడిగి

మీరు తిన్న బల్లలను ఉడ్చేది నేనే....!


లంచం రుచిమరిగిన ఈ ఖాకీ పులుల మద్య

తప్పుడు కేసు కొసం ప్రతి క్షణం వేటాడబడుతున్నది నేనే ....!.


ఏతల్లి చేసిన పాపానికో మీ పుణ్యమూర్తుల

లోకాన ఉమ్మివేయబడ్డాను......


నాయీ పాపిష్టిజన్మకు విముక్తి ఎన్నడో?

నాకెవరిమీద అసూయ లేదండీ.....!


మీరు... మీ పిల్లల౦తా... మీ కోటు జేబులకు

ఎర్రగులాబీలను గుచ్చుకో౦డి!


నేనీ ఈ రాతిరి అమావాస్య చీకటిలో

రైలు పట్టా పక్కన నిశీధి స౦గీతాన్ని

ఈ విరిగిన వేణువుతో ఆలపిస్తాను.....


నా ఆలాపనా ఏలాగొ మీ గుండెలకు చేరదు....

ఏకదాటిగా కురుస్తున్న నా కన్నీరు ఆగదు....



కౄరత్వంలో కొత్త పద్ధతులెలా కనిపెట్టలని మీరు చూస్తుంటే...

అత్యాచారాలనెలా అంతమొందించాలా అని నేను చూస్తున్నా...


లోకమంతా అన్యాయం నిండివుంటే రా! ఎదుర్కొని పోరాడుదాం!

నీ చుట్టూ కట్టుకున్న వంచనని తెంచుకొని రా... చేడుపై చైతన్య యుద్దం చేద్దాం...


నీ గుండెల్లొ మంచిని ఆశయంగా మార్చే దమ్ము వుంటే రా...

అన్యాయాన్ని అంతమోందించి...న్యాయాన్ని గెలిపిద్దాం...


పొద్దు పొడుపుని సూచించే వేగుచుక్కలా ఆరిపొవద్దు...

దిక్కులను చూపించే దిక్చూచిలా మారుదాం...


మీ పిరికితనానికి బానిసలా బ్రతికుంటే ఎంతా... చస్తే ఎంతా...?

సార్ధకం లేని జన్మకు పిడికెడు బుగ్గి ఉంటే ఎంత...? లేకుంటే ఎంత...?


నేను కొద్ది క్షణాల అతిధిని...అయితేనేం...

మీ చైతన్యంలొ విద్యుత్తునై ప్రవహిస్తాను...


నేను ఆరిపొయే దీపాన్ని..అయితేనేం....

ఉన్నంతం వరకు వెలుగును ప్రసాదిస్తాను...


నీలొ ఆత్మవిశ్వాసం ఉంటే...ఆకాశానైనా అధిరొహిస్తావు...

నీ పనిలొ నమ్మకముంటే...నరకానైనా జయిస్తావు...


సాధన లేకుండా...స్వర్గాన్ని ...

ప్రయత్నం లేకుండా...విజయాన్ని...పొందలేవు...


అందుకే....సాగిపో ధైర్యంగా...చీకటిని చీల్చే సూర్యునిలా....

మిగిలిపొ చరిత్రలొ నిలిచిపొయే దృవతారలా...




ఇష్టమైన సంధ్యాకాలం...చిరాకు పుట్టే మధ్యాహ్నం....రెండూ సూర్యుడు నుండే వస్తాయి...


వాసన ఇచ్చే పూలు...నేల రాలే ఆకులు... రెండూ చెట్టు నుండే వస్తాయి...


ఆహ్లదనిచ్చే చిరు జల్లులు....ప్రాణాలు తీసే తుఫాను... రెండూ మేఘాలే సృష్టిస్తాయి....


ఆకలిని తీర్చే పంటలు...కలచవేసే భూకంపాలు ... రెండూ పృధీ నుండే పుడతాయి...


ఎగిసిపడే అలలు...ముంచెత్తే సునామీలు....రెండూ సముద్రం నుంచే జ్వలిస్తాయి...


జన్మనివ్వటం...ప్రాణాలు తియ్యడం...రెండూ దేవుడి నుంచే అవతరిస్తాయి...


అందానిచ్చే పర్వాతాలు...ఆత్మహత్యల లొయలు...రెండూ కొండల నుండే జ్వనిస్తాయి...


కృంగదీసే కష్టాలు...సేదతీరే సుఖా:లు...రెండూ మానవ ఇతిహాసంలొ బాగాలవుతాయి...


తొక్కుతున్న బండ...మ్రోక్కుతున్నా శిలలు...రెండు రాయి నుండే వస్తాయి...


కంటని తడిపే ఓటమి...కన్నీటిని తుడిచే చెలిమి...రెండు జీవితానికి బొమ్మ బొరుసులవుతాయి...


తప్పటడుగుల పసితనం...తప్పుటడుగుల యువ్వనం...రెండు వయస్సు నుండే పుడతాయి....


గుండెలొ ద్వేషం...ఆదరించే అభిమానం...రెండు ప్రేమనుండే వస్తాయి...


సమతుల్యం కోసం ప్రతి దానిలోనూ మంచి చెడు రెండు ఉంటాయి...


మంచిని ఆస్వాదించాలి...చెడుని పోరాడాలి...అప్పుడు గెలుపు నీ ఇంటిపేరవుతుంది...



నీ చూపులు వేకువవుతాయనుకున్నాను....

కాని కర్పూర కళికలై కాల్చుతాయనుకొలేదు....



నీ మాటలు ఓదార్పునిస్తాయనుకున్నాను...

కాని కాలమంతా కరిగి కన్నీరవుతాయనుకొలేదు....



నీ తలపు సంజీవనై బ్రతికిస్తున్నాయనుకున్నాను.....

కాని ఎడబాటుతొ గుండేను చీల్చుతాయనుకొలేదు......



నీ నైషదం కానిది నైరాశ్యమనుకున్నాను.....

కాని ప్రణయ పారవశ్యంతొ మండిన ప్రళయమవుతాయనుకొలేదు...



నీ దారిలొ నా ప్రతి అడుగు జయప్రదమవుతాయనుకున్నాను.....

కాని అధరాలపై పయనించే అక్షరాలలా ఆర్ధ్రమవుతాయనుకొలేదు...



నీ చిరునవ్వులు వసంతమై ఆశలను చిగురిస్తాయనుకున్నాను....

కాని గాయమై గ్రీష్మంలా మండిస్తాయనుకొలేదు....



నీ స్పర్సతొ మౌనంగా ఉన్నా అంతరంగాన్ని మేల్కొలుపుతాయనుకున్నాను...

కాని తొడు లేని ఒంటరి తనాన్ని మిగులుస్తాయనుకొలేదు......



నీ అనుభూతులను ఆత్మీయపు జ్ఞాపకాలుగా ఉదయిస్తాయనుకున్నాను...

కాని సంధ్య కాంతిలొ కుంగిపొతున్నా సూర్యునిలా అస్తమిస్తాయనుకొలేదు....




సంధ్యా వందనం ముగించుకొని....నేను వెనుకకు తిరిగి వస్తున్నా.....

నిన్ను తాకిన ఆ లేత కిరణాల మేనీ సొయగాలు ఆర్తీగా నన్ను తాకుతున్నాయి....

వెనక్కు వెళ్ళాలొ .... మరలా నిన్ను చూడాలొ...అన్న ఆలొచన ఒక్క క్షణం ఉక్కిరి బిక్కిరి చేస్తుంది....

కనులు చూడమంటున్నా.... మనసు ధైవ దర్సనం ముందు అంటూ మారాం చేస్తుంది....

నిన్ను చూడగానే ధైవ ధ్యానం మరచి....మనసు కొంచెం మలినమౌతుందేమోనన్న భయం ఓ వైపు....

గుడిలొ దేవత కాకున్నా....గుండెల్లొ దేవతే కదా అన్న సమర్ధన నిండిన సందేహం ఓ వైపు ......

చివరకు నిన్ను చూడాలన్న కొరికే తన పంతాన్ని నెగ్గించుకుంది....

తీరా తలపైకెత్తి చూస్తే నీ జాడలేదు నా కనుచూపు మేరలొ....

మైలు పడ్ద నా మనసును శుభ్రం చేసుకొవడానికి మరొ స్నానం....

ఇదేగా రొజు జరిగే తంతూ.....నీవు మాత్రం నన్ను కన్నేతి చూసిన గుర్తుతైనా లేదు ఏమిటి ఘోరం....


సాయంత్రం వేళా కొనేటి వీక్షణం... కనులకు కొంచెం ఆనందదాయకం....

కన్య సొయగాలు కంటికి ఎదురుగా...రాగాలాపనలు గాలి గొపురానా...

నీ రాక కొసం ఎదురు చూసే నా మది మందిరానా...హరికధా కాలక్షేపాలు ధైవ మంఠపానా....

నీ అడుగుల సవ్వడి .... నా గుండేల్లొ అలజడి....

పట్టు పరికిణీలొ...పాల కుసుమంగా...వెన్నేల పందిరిలొ...పసిడి రూపంగా....

పున్నమి వెన్నేల కాదే మరి ఇంత వెలుగు ఎక్కడిది అని మది పదే ... పదే అడుగుతుంది....

తీరా నా కనులు దాటి వెళ్ళుతుంటే...నీ కనుపాపలలొ ఎదొ చిన్న మెరుపు.....

అర్ధం కాలేదు....ఆ నాడు నా మనసు ఆవేదన......




ఓటు నాడు నీతుల కొతలు కొసిన చేతకాని జాతినేత మన రైతు.....

మ్రోగిస్తున్నారు కరెంటు బిల్లు మోత....

విదిస్తున్నారు బారీ విధ్యుత్తు కొత......

బ్రతుకు బరువై...గుండె చెరువై....

వర్షం మరుగై.....నీరు కరువై.....

భొరు...భొరున విలపిస్తూ....

భూమాతకు చిల్లులు వేసినా....

బొరు లొన నీటిచుక్క వెక్కిరిస్తుంది....

అప్పులతొ బ్రతుకును భయపేడుతుంది....

క్షేమం మరచి... క్షామం వలచి

కనికరించని వరునుడు....

ఈ రీతీ బాధల వాగులలొ సాగే కర్షక జాతి....

భాగొగులు మారెదేప్పుడు.....

వారి తలరాతలు మార్చేదెవ్వరొ....

తమ పొలంలొ పచ్చదనం చూసేది ఎప్పుడో.....



నాకనిపిస్తుంది....

ఏకాంత వేళ ప్రకృతిలొ నిద్రపొవాలని....

శ్రావణ మేఘం పై తేలిపొవాలని....

సంధ్యారాగం వింటూ స్వప్నించాలని.....

సాగర తీరాన అలలతొ ఆడుకొవాలని....

తుషార హిమబిందువులతొ జలకాలడాలని...

శిశిరంలొ పిల్ల గాలి తెమ్మరలకు వణికిపొవాలని....

సీతాకొక చిలుకనై నింగిలొ నాట్యమాడాలని....

పారే సెలయేటి సరిగమల్ని వినాలని....

వసంతంలొ కొయిలతొ పొటి పడాలని...

వెన్నెల్లొ కుర్చోని ప్రకృతి కాంతను వర్ణిస్తూ కవితా సంపుటికా వ్రాయాలని .....

ఎందుకొ నాకనిపిస్తుంది.....! మరి ఎందుకొ??????



మొదటిసారి ….నీ కళ్ళ ఎదుట నిలిచిన రోజు కావలి .....
మల్లి కావాలి…!!!

మొదటిసారి…. నీతో నడిచిన పయనం కావలి....
మల్లి కావాలి ..!!!

మొదటి సారి….నీతో మాట్లాడిన క్షణం కావలి.....
మల్లి కావలి..!!!

మొదటిసారి నిన్ను తాకిన పులకరింత కావాలి .....
మల్లి కావాలి…!!!

మొదటిసారి నీ కౌగిలిలో కలిగిన పరవశం కావాలి.....
మల్లి కావాలి..!!!

మొదటి సరి నిను ముద్దాడిన మధురం కావలి.....
మల్లి కావాలి…!!

మొదటి సారి మళ్ళీ ఒక్కసారి అంటే...... ఒక్కసారి...... తిరిగి రావాలి …!!!



నీ వెవరొ నాకు తెలుసు....

నా వెంట పడుతున్నావని తెలుసు...

నాకు తొడుగా వుంటావని కూడ తెలుసు....

కాని కొన్ని సమయాలలొ....అంటే....

మబ్బులు కమ్మినప్పుడు మేఘగర్జనకు భయపడి పారిపొతావు...

వర్షం పడినప్పుడు తడిసిపొతానని భయపడి దాగుంటావు....

చీకటి అలుముకున్నప్పుడు భయపడి నాలొ కలిసిపొతావు...

కాని ఒక్కటి మాత్రం గుర్తుంచుకొ....

నన్ను ఒంటరి వాడిని చేసినా..

నన్ను వీడి పారిపొయినా...

భయపడను.... బాధపడను....

ఎందుకొ తెలుసా....

నీవు ఎందుకు పనికిరాని నా "నీడ"వి కాబట్టి.....!



నిరుపేదలను రోడ్డున వదిలేయటమే మనం నేర్చుకున్న మానవత్వం....

నిస్సహాయులని చూసి నవ్వుకోవటం మనం నేర్చుకున్న మానవత్వం......

కులాల చిచ్చులు రేపటమే మనం నేర్చుకున్న మానవత్వం.....

మనుషులని చంపటంమే మనం నేర్చుకున్న మానవత్వం....

ఐకమత్యాన్ని ఆచరించకపోవటమే మనం నేర్చుకున్న మనవత్వం....

ఒకరిని చంపైనా మేము బాగుపడాలనుకోవటమే మనం నేర్చుకున్న మానవత్వం....

మంచిని మరచి వంచన చేయటమే మనం నేర్చుకున్న మానవత్వం....

మా దేశం నేర్పిన పాఠం ఇదే....

మా మనుషులు నడిచే బాట ఇద.....

ప్రేమను మరచి....స్వార్దంతో బతకటమే మనకు తెలిసిన మానవత్వం....

ఇదే మనం నేర్చుకున్న మానవత్వం.....

మా నవతకు నేర్పుతున్న మానవత్వం.....



నాటి నా భాగ్యనగరం:-

చారిత్రాత్మక ప్రదేశాల కేంద్రబిందువు నా భాగ్యనగరం....

సభ్యమత సమైక్యతకి చిరునామా నా భాగ్యనగరం....

వలస వచ్చిన ప్రజలను ఓడిలో దాచుకున్న భూమాత నా భాగ్యనగరం...

పొట్టకూటికోసం వచ్చిన వారికి ఆకలి తీర్చిన మాతృమూర్తి నా భాగ్యనగరం....

సాగరన్ని గుండెలో దాచుకున్న సౌదర్యపు సొగసరి నా భాగ్యనగరం....


నేటి నా భాగ్యనగరం:-

పెద్దపెద్ద భవనాల పునాధులను గుండెలొ గుచ్చుకుంటుంది నా భాగ్యనగరం....

పేదప్రజలకు గజం భూమి అందనంత ఎత్తుకెగసింది నా భాగ్యనగరం....

ఉగ్రవాదుల అగ్రనిలయం నా భాగ్యనగరం....

క్షణక్షణం భయాందోళనలో మునిగిపొయింది నా భాగ్యనగరం....

కులమతాల చిచ్చులో మండిపోతుంది నా భాగ్యనగరం.....

ఘడియ ఘడియకి పేలుతున్న బాంబులతో భగ్గుమంటుంది నా భాగ్యనగరం.....

నాడు అది భాగ్యనగరం నేడు అది దౌర్భాగ్యనగరం.....



గెలుపు కొసం కదిలే నీ పాదాలకు సందేహపు అడ్డుకట్ట వేయ్యకు...

నదిలా పరుగులు తీసే నీ ఆశయపు పయనాన్ని నిరాశతొ ఆనకట్ట కట్టకు...

నీ కలల వెనుక కదిలే ఆశల ఆరాటాన్ని అలసిపొనివ్వకు....

క్షణాలలొ కుదుటపడే ఆవేశాన్ని ఆరని చితిగా మార్చకు....

కృంగదీస్తున్న కష్టాలపై కసిరగలాలి....

అడుగంటుతున్న నీ జీవితం ... వసంతంతొ చిగురించాలి....

బ్రతుకును గేలి చేస్తున్న ప్రతి అపజయం....

నీ పట్టుదల పిడికిలిలొ బందికావాలి....

విర్రవిగుతూ విరుచుకుపడే అవమానాలు...

నీ ఆత్మవిశ్వాసం ముందు విలవిలబొవాలి.....

నీ చేదు జ్ఞాపకమేదయినా అనుభవాన్నిచ్చే ఓదార్పుగా నిలవాలి....

పసితనం దాటిన నీ ప్రాయం... సమరానికి స్వాగతమవ్వాలి...

పసిడితనంతొ నిండిన నీ యువ్వనం....ప్రయత్నంలొ ఎదురైన పరాజయాలను ఆస్వాదించాలి.....

రగిలే శ్వాసే నడిచే నీ గమ్యాన్ని చేర్చే దిశగా మారాలి..

కంటిదడిలొ నీ కన్నీరు ఇంకిపొయినా...బ్రతుకు ఓడిలొ నవ్వులు విరియాలి ...

కలగనే నీ సౌదమేదయినా దైర్యాన్ని పునాదిగా కట్టాలి...

యదను తాకే గాయాలు ఏవైనా... మదిని పుసే చైత్రాలవ్వాలి...

ఎదురుచూసే కాలలు ఏన్నతైనేంటి.....విజయాన్ని ఆస్వాదించే ఆ ఒక్కరొజు కావాలి....

వెలుగుగా మారే వేకులేన్నుంటేనేం... అడియాసలను చీల్చే ఆనందం రావాలి.....

సుటిపొటి మాటలు తూపాకులైతేనేంటి...ధగా చేస్తున్న కాలపు గుండెల్లొ తూటవవ్వాలి...

గగనమే నీ తొలి కడలి....బ్రమరమే నీ మజిలి....

అలలుగా మారిన నీ ఆలొచన సంద్రాన్ని నలుదిశల విస్తరించు.....

హేలన చేసిన అపజయం ....నీ నమ్మకమనే ఆత్మసైర్ధ్యానికి బానిసవుతుంది.....



దేనికొసం ఈ యువత వేతుకులాట...!?

అందం కొసమా....?

తగ్గుతున్న లావణ్యం కొసమా...?

కానే కాదు....

మారని తమ బ్రతుకుల ప్రక్షాళన కొసం....!

బద్దలైంది మీ బద్దకాల అద్దమే....మీలొ రగులుతున్న కసి కాదు.....

ఎదురు చూస్తుంది విజయమే ...గేలిచేస్తున్న అపజయం కాదు....

శకాలాల నిండా మీ ఆత్మవిశ్వాసమే....దెబ్బతిన్న మీ నీరాశలు కాదు....

మగత నిద్రలొ నిప్పులు లేవు... మరిగే గుండెలొ అరుపులు తప్పా...!

మనుగడ కొండపై రుధిర జ్వాలలు లేవు...జీవం చిందుస్తున్నా సింధూరాలు తప్పా...!

ఆవిరవుతుంది ఆత్మసాక్షి కాదు.... మది వీడని ఓటమి కలవరం తప్పా....!

రెప్పల తెరల్లొ చీకటి లేదు....తూర్పు రేఖల సూర్యతేజం తప్పా....!

నీరాశతొ నిండిన కళ్ళూను కడిగి చూడు....పరుగులు తీసే లక్ష్యం ఉంది....

మరిగే చెమట చుక్కను తుడిచి చూడు....చేరువయ్యే మార్గం చెంతనే ఉంది....



రెక్కలు లేకపొయిన నన్నొ "పక్షి"ని అన్నారు....

కనుల ముందు నీ అందాన్ని చూస్తున్నా నన్నొ గుడ్డి వాణ్ణీన్నారు...

నేను ఎంత స్వేచ్చగా ఉన్నా పూర్తీ బందీనన్నారు.....

నేను ఎంత ఆరాధిస్తున్నా.... నన్నూ నాస్తీకుణ్ణీన్నారు...

నువ్వే చెప్పు.... మన ప్రేమ సాక్షీగా....

నేను ప్రేమ పక్షినా...?

మన ప్రేమ గుడ్డిదా...?

నేనొ ప్రేమ ఖైదీనా...?

నేనొ ప్రేమ నాస్తీకుడినా...?

నీ జవాబు అవును అయితే మనది అమర ప్రేమరా...!


పుష్ప గుచ్చం నీకిస్తే... నవ్వుల జల్లుల్ని నాకిచ్చావు...


మనసు పడి ప్రేమిస్తే... మమతల వాన కురిపించావు....

ప్రేమ వరదలై పారేక ఎక్కడ కొట్టుకు పొయేవు....?

నా ప్రతి చూపు నీకై వెతుకులాటే....

నువ్వు ఎక్కడ ఉన్న నా గుండే గది ఖాళీ....

అలకలు మాని వచ్చి చేరిపొ....!

వలపుల తొటలొ వసంతాలు ఏరుకొ...!


నీ కనులకు కాంతి నేను....

నీ కలలను కన్నది నేను....

నీ కష్టమైన... నష్టమైన... మొత్తం నేను....

నీ చిరునవ్వు.... దిగులు... నేను....

నీ ప్రతి ఉదయంలొ వేకువ నేను...

నీ ప్రతి నిమిషం తొడై నిలిచేది నేను....

నువ్వు కన్పించక పొతే బెంగతొ వెతికేది నేను...

నీ కన్నిటిని తుడిచేది నేను....

నువ్వు గెలిచిన విజయం నేను...

నీ అలసట తీర్చేది నేను....

నీ మెలుకువకు దీపం నేను....

నిన్ను అడుగడుగున నడిపించేది నేనని మరువకు మిత్రమా.....



నీకు తెలుసు ఒక్క రాత్రిలొ ప్రేమ పుట్టదని...

ఒక్క రాత్రిలొ నక్షత్రం పుట్టదని....

నా సృజనాత్మక లొకాన్ని మెల్కొపావు....

ఆ అంతర్లొకాలు పూస్తున్న పరిమాళాలే ఈ నాటి

గాలుల్లొ కలిపి వ్యాపిస్తున్నావు....

ఒంటరిగా  వంతేన మీద కూర్చొని...

నా మీద చంద్రుడి చేత వెన్నెల కురిపించుకుంటున్నా....

పారిపొతున్న ప్రవాహన్ని చూస్తూ..... మదిలొ బాధ....

నీకేం తెలుసు మిత్రమా....

నా అర్ధరాత్రుల్ని కాల్చే దీపాలకే తెలుసు....

నా నిట్టూర్పుల వేడి కధలు....

కాని ఒక్కటి మాత్రం గుర్తుంచుకొ......

ఎక్కడ నా కలలన్నీ నిజమవుతాయో....

ఆ మధుర నిశ్మబ్దం లాంటి ప్రవాసం నీ దరహసం...

రాజు నగరాల్ని పాలించినట్లు....గాలి తొటల్ని పాలిస్తుంది....

నీవు నా ఊహలన్ని పాలిస్తున్నావు....

చిన్నప్పుడు కాశీ మజిలి కధల్లొ నుంచీ.....

అరెభియన్ నైట్స్ కధల్లూ నుంచీ....

నా చైతన్య సీమల్లోకి దిగిన రాజకుమారులందరూ....

నీవుగా తలచి ప్రేమిస్తున్నానని మర్చీపొకా......!




తొటలొ పూలెన్ని ఉన్నా....సిరిమల్లె వంటి నీ నవ్వు చాలు....

ఎద పరిమళభరితమయ్యెందుకు....


నింగిలొ తారలెన్ని ఉన్నా.... జాబిలి వంటి ఈ మోము చాలు.....

మదిలొ వెన్నెల కురిసేందుకు.....


నా అన్నవారెందరున్నా.... నీ చెలిమి చాలు.....

నిశేదిని గొడల్నీ చీల్చేందుకు.....


నా దు:ఖ:మెంతున్నా.... నీ ఓదార్పు చాలు....

జాలువారే కన్నీటి తడిని తుడిచేందుకు.....


నా ఆనందం కొరకు వెనుక ఎందరున్నా....నీ తొడు ఉంటే చాలు.....

మౌనంగా ఉన్న గుండెలొ అనుభూతులను నింపెందుకు..........


నేను గమ్యం చేరేందుకు రెప్పల మాటున చీకటెంత ఉన్నా... నీ స్నేహం చాలు....

బ్రతుకున పున్నమి వెలుగులు విరిసేందుకు......


నా నీడగా ఎందరున్నా..... నా ప్రియ సఖి... నువ్వుంటే చాలు......

జీవితాంతం నీతొ కలిసి నడిచేందుకు......



మనసునే మగ్గంలొ విచ్చుకున్న మన స్నేహాన్ని సరికొత్త చీరగా మలిచాను....

జాలువారే కన్నీటిలొ ఆనందపు రంగులను కలిపి....చెలిమిని చెమికిలుగా దిద్దాను......

అనురాగపు చెక్కిళ్ల పై విరబూసే చిరునవ్వుల అందాలను జెరీ అంచుగా చిత్రీంచాను....

అత్తరు పూసిన మన నేస్తాల మొగలి పొత్తును ఆర్బాటపు హంగులను అద్దుతున్నాను.....

నా ఊహలన్ని పాలిస్తున్న నీ అలక ...కులుకుల సింగారాన్ని సప్తవర్ణాల దారాలుగా మలుస్తున్నాను...

నా అనుభవాల వ్యక్తీకరణకు అందని నీ అందాలన్ని కలబొస్తూ ఈ కొంగుకు చెంగును ముడివేస్తున్నాను...

చుర చుర చూపులతొ చీకటిని చిలుకుతూ...వెలుగుల నీ రూపాన్ని వింధ్యామర పైటగా సవరిస్తున్నాను....

ఎన్నొ నా కలలా అంతరాలలొ వెలిసిన ఆ కళత్మాక నేతా....

పసిడి కాంతులతొ నిండిన నా వన్నేల రాశికి అర్పిస్తున్నాను...



నన్ను విడిచిన నీ లొకంలొకి....నా ఒంటరితనపు గదిలొంచి

ఆశ... ఆశగా పరుగు పెడుతూ వస్తాను....

చేతినిండా కలువ పూలు పట్టుకొని నుంచుంటాను...

ఒక్కటైనా నువ్వు తీసుకుంటావని వెర్రిగా కాంక్ష పడతాను...

నువ్వు పలకరింతగా నవ్వగానే....ఆశ్చర్యం...

నా చేతిలొ బరువు పెరిగి ఇంకొ కలువ వచ్చి చేరుకుంటుంది... నీలా....


నీ చూపులు... పువ్వుల పాదాలతొ లేలేతగా కదలి వచ్చి...

చిగురుటాకుల్లా నన్ను తాకి....

యుగ యుగాల జ్ఞాపకాల కొసం...

నాలొ... నా లొ లో...అన్వేషిస్తావన్న భావన ....

అయిన నీ ఎడబాటుల మజిలి దొరకదేం మిత్రమా....

కలలా ఆకాశంలొ కురుస్తున్న....వెన్నెల వర్షాన్ని ఒడిసి పట్టుకొని తాగుతున్నా....

నా కనుఇంటిలొ ...తర తరాల వెలుగును ప్రసాదిస్తావన్న ఆరాధనతొ....

అయినా ఈ గుండేలొ నీ ప్రేమ దాహం తీరదేం నేస్తమా....

మౌనాన్ని దాటి వచ్చి నా మనసులొ మాట నీకు చెప్పలేకపొయా...

త్వరలొ మనస్పూర్తిగా నా మనసు నీ కందిస్తా....

ఇంతకి ఏముంది నీ చూపులొ...



దూకుదామా.... తాకుదామా... మెల్లగా వచ్చి ఆక్రమించుకుందామా అన్నట్లుగా....

నీ చూపుల సమరం ను నా ఒంటిపై పారడినట్లుగా చాకచక్యతను చూపిస్తున్నావు....

తనువు పరాజితమై మరులుతున్న నిశివేళలొ నీ సరసం కూడ కొద్దిగా రుచి చూపించరా...!

అనుమతిలొ నా ఊహల అంగరక్షకుడిగా పహరా కాస్తున్నావు...

తడారిపొయిన నా కలలా ఏడారిలొ నీ సొగసు చినుకులను కురిపించరా....

కర్ణపుటంచుల నుండి జారుతున్న మగసిరితొ నా అందానికి అంటుకడుతున్నావు....

మధన చెరసాలలొ ఖైదీ కాని కాంక్ష వుంది తాపంతొ కరుణించరా ...

అంతులేని ఎడబాటుతొ గుండెలొ విరహపు గార మోగిస్తున్నావు....

నవసొయగాల తడి సుగంధాన్ని అంతు చూడనిదే నాకు నిద్ర రాదురా...

దేహపుటగాధాలలొ శాశనాలు కూడ ఆపలేని గాఢతను రగిలిస్తున్నావు....

ఉద్వేగంతొ కాలుతున్న నా ఏకాంతానికి నీ అదర సుధలతొ ఆర్పేయరా....

శతజన్మలైన ఆగిపొని యాత్ర చేసి బుగ్గలొ సిగ్గులను పూయిస్తున్నావు...

నా హృదయ సామ్రాజ్యనికి అధిపతివై నన్ను హత్తుకొరా...

ప్రాయమైనా... నా ప్రాణమైనా .....నీకొసమేరా...!

ఈ కుసుమం పై నీ కొప ఖడ్గం దూస్తావేందుకురా.. కనికరించి సేదతీరరా....


నీవు నా చెంతనుంటే....

ఊహతొనే వాతావరణం ఒక్కసారిగా వేడెక్కిస్తావు...

నవనాడులూ జ్వలింపజేస్తావు....నరనరాలు జ్వరిస్తావు.....

జాగుచేయక దరిచేరుదామంటే....

చుట్టు చీకటీ ...ఆపై వాన ... జంటగా వెక్కిరిస్తున్నాయి...

కలహంసై తనువును సుతిమెత్తగా తడుముడుతుంటే....

నీ జ్ఞాపకాలతొ భారంగా... బాధగా కనులు మూసుకుంటే....

ఇక నిద్రలేలా వస్తుంది....రాత్రి ఎలా గడుస్తుంది.....

దగ్గరలేని దూరంలొ... ఓపలేని భారంతొ... అణుక్షణం నీ కొసం తపిస్తున్నా....

కదలని పగళ్ళు.... కలలా రాత్రులు ... కలత నిదురలు....

నిట్టుర్పుల సెగలు... ఓదార్పులేని దిగుళ్ళు ఎన్నాళ్ళీలా....


గాడ నిద్రలొ సేద తీరుతున్న వేళ....

కలొ...కలవరమో...ఏదొ ఓ ఉలికి పాటు రూపంలొ తనువును...

మనసును ఒక్కసారిగా కుదిపితే...

అసంకల్పితంగానే ఓ మెత్తటి చేతి స్పర్స వెచ్చగా జొకొడుతుంది....

"నిశ్చింతంగా ఉండు ...నేనుండగా' అన్నట్లు ప్రేమగా లాలిస్తుంది...

అక్షరాలలొ ఒదగని అద్బుతమైన నీ స్నేహనుభూతిని భరొసాగ అందిస్తుంది...

బ్రతుకు పుస్తకంలొ తొలిపుటలొ ఆ స్నేహం తల్లిదైతే....

చివరి అక్షరం వరకు ఆ నిశ్చింతను అందించే హక్కు ...అధికారం జీవనసహచరితే...

మనలొ సగభాగమై...తన అస్తిత్వన్ని మనలొ చూసుకొనే జీవిత భాగస్వామిదే....

ఆ బంధం ఎంత సున్నితమో... అంత అమృత ప్రాయం....చెడితే అంత విషతుల్యం....



ఎదురుగా ఉన్నప్పుడు కన్నుల్లొ...

దూరంగా ఉన్నప్పుడు నా ఊహల్లో కాలక్షేం చేస్తుంటావు....

ప్రంపచాన్ని పట్టించుకొనంతగా పరవశంలొ ముంచేత్తిస్తావు......

అణువణువునా నిండి నా హృదయాన్ని చైతన్య ప్రవాహంగా మారుస్తావు....

మనసును మౌనంగా పాలిస్తావు....

ఆశలను ఆకాశంలొ విహరింపజేస్తావు....

అనుభవ వ్యక్తికరణకు అందని భావంగా నిలుస్తావు....

చెప్పలేని అనుభూతితొ మనసును హత్తుకుంటావు...

ఊహల పల్లకిలొ ఓలలాడిస్తావు.....

ఏమిటి నేస్తం ఈ మాయ.....!



నగిషీ కొసం ప్రాకులాడే మానవుడు

అందని చుక్కలవైపు చూపును నిలుపుతున్నాడు ...

కళ్ళముందు కదలాడే కటిక నిజాలను చూడకుండా...

గాలి మేడల సౌదాలలొ గుడ్దివాడై జీవిస్తున్నాడు.....

జీవన నాడులైన అప్యాయతలను వదిలి....

స్వర్గాన్ని అందుకొవాలనే ప్రేరాశతొ నింగికి నిచ్చేనలేస్తున్నాడు....

అనురాగల విలువ మరిచి... అనుబంధపు పేగు తెంచి....

సాటి మనిషి వేదన చూస్తూ జాలి లేని శిలలా మారుతున్నాడు...

మమకారాలను అదృష్యం చేస్తూ.....

మానవ ఇతిహసాని మరిపింపచేసే ఈ చదువు సంష్కారాలేందుకు......!

కరుణను కాల్చే మతాన్ని ఆస్వాదిస్తూ....

గుండేను దయ లేని బండగా మార్చే కులాలతొ నిండిన ఈ సారం లేని సాంప్రదాయాలేందుకు....!

బుణం తీర్చుకొనే తరుణం వస్తే పురాతన జీవితాన్ని బూడిద చేస్తున్నాడు...

ఆర్బాటపు ఏరుకు చెరుకొగానే.... ఆత్మీయపు తెప్పను తగలబెట్టెస్తున్నాడు....

ఎప్పుడు మారుతుంది ఈ సమాజం....మనసున్న మనిషిగా అభిలషిస్తున్నాను.....



కడుపు కింత కూటికొసం అలమటిస్తే.....

కనపడ్డొడల్లా కడుపు కిందకి సూసినొడే గాని...

కనికరించినొడు లేడు ఈ దేశంలొ....

"బొడ్డులొ రూపాయి బిల్ల..." పాటకి నువ్వదరగొట్టేశావని

ఒకడొచ్చి నా గుండెల మీద వందనొటు గుచ్చితే....

ఇంటికాడ తన బిడ్డ జరానికి మందులొస్తాయని నవ్వాలొ...

లేక వాడు తన రొమ్ముల్ని నొక్కినందుకు ఏడవాలొ తేలియక.....

పాట...పాటకి డ్రస్సులు మార్చినట్లే...

ప్రతి అవమానానికి నవ్వుకట్టగా మార్చుకుంటునా వాళ్ళేందరొ....

ఒక రూపాయి తన్ను చూసి ఈలేసినా...

ఒక కళా పొసన తన్ను చూసి కన్నుగొట్టినా....

ప్రొగాం అయిపొయాక ప్రతి ఊరు "నీ రేటేంతని అడిగినా"....

ఎదురు తిరిగితే ఎండు కుంటమే దిక్కు గనుక....

మొఖం రంగుతొ పాటు అన్ని కడిగేసుకుంటు పొయిన వారెందరొ....

అయిన వెండి తెరకొ న్యాయము... ఎడ్లబండి స్టేజికొ న్యాయమా....

బొడ్డు సుట్టూ పదారు రీళ్ళు తిప్పి తిప్పి మొకాన కొడితే....

బంగారు నందుల పురష్కారాలిచ్చే దేశంలొ....

నేను బొడ్దు సూప్పిచ్చే సరికి ఆశ్లీలమై కూకుందా...?

అని ప్రశ్నించుకునే వారు లేకపొలేదు....

కూటి కొసం కొటి విద్యల్లొ ఇది కలిసిపొవలిసిందేనా....

ఎప్పుడు మారుతుంది ఈ సమాజం...

ఒక భావి భారత పౌరుడిగా ప్రశ్నిస్తున్నాను.....!


(నేను గ్రానేట్స్ పని మీద చీమకుర్తి వెళ్ళవలిసి వచ్చింది....అప్పుడు అక్కడ తిరునాలలొ....

రికార్డింగ్ డాన్సర్స్ నీ చూసాను....ఆశ్లీలంగా ఉన్న నృత్యాన్ని ద్వేషించాలొ...లేక...విధి వారి

బ్రతుకులను ఇలా మార్చిందని బాధ పడలొ తేలియక ఈ కవిత రూపంలొ పొందిపరచాను.....

తప్పులుంటే మీ యొక్క పెద్ద మనసుతొ ఈ చిన్న వాడిని క్షమించండి..... )



(వరద బాధితులను దయచేసి మానవతతొ అదుకొండి....మీకు తొచిన సహయం చేయ్యండి.... మీ రేవా....)

ఆకాశాన్ని మేఘం నల్లని కంబళిలా కప్పుకొంది....

ఆనందం మనసులొ మయూరబర్హంలా విప్పుకొంది...

ఆలొచన లెందుకు జవ్వని...!

విలొకించు వర్షా సంధ్యని....!

అని ఒక కవి అన్నట్లుగా....

ప్రకృతి వికహట్టహసం చేస్తే మనిషికిక దిక్కేది...?

కరుణ చూపాల్సిన వరుణుడు ప్రళయ గర్జన చేస్తే వేరే దారేది...?

అన్యాయం విలయమై విరుచుకు పడింది....

మానవ జీవితం కకావికమైనది...

ప్రజల కల చెదిరింది... తీరని వ్యధ మిగిలింది....


ప్రతి ఉదయం భారం తొనే మొదలవుతుంది...

ప్రతి రాత్రి సమస్యల సుడిగుండంతొనే ముగుస్తొంది...

రేపటి మీద వారికిప్పుడు ద్యాసలేదు...

ఈ పూట గడిస్తే చాలన్న ఆశ తప్ప...!

మనం తేరుకొని ఒక్కసారి తేరపార చూస్తే...

నలుదిశల కన్పిస్తున్నది.... ప్రళయ శిధిలాలు...

వినిపిస్తున్నది శిధిల నాధాలు...

జన జీవన స్రవంతికి జీవనాడులైన అనుబంధాలు

అయిన వారికొసం మినుకు మినుకు మనే ఆశతొ....

ఎదురు చూపలు ఆదరవు కొసం అన్వేషణ....

అన్ని కొల్పొయి.... అందర్ని కొల్పొయి....

జీవం ఉన్న జీవచ్చావాలు...అడుగడుగునా స్మశాన వాటికలు....

మానవ ఇతిహసంలొ అనుబంధపు పేగు కదలాలిప్పుడు....

అందుకొసం ఒక్క క్షణం మనసు పెట్టి ఆలొచించండి....


ఆరొజు ఎప్పటిలాగే తెల్లవారిందని అనుకున్నారే కాని...

తమ బ్రతుకులిలా తెల్లారిపొతాయని వారు ఊహించలేదు...

ప్రకృతి ఒడిలొ దగాపడిన జీవితాలు... మన ముందు సాక్షాత్కరిస్తున్నాయి.....

సాటి మనిషికి సాయమందించడమే కధా మానవతా....!

ఆపదలొ అదుకొవడమే కధా సహృదయతా.....!

పట్టెడన్నం వారికిప్పుడు పరమానం.....

చిరిగిన వస్త్రం వారికిప్పుడు పట్టు వస్త్రంతొ సమానం....

మీ హృదయపు కవాటలు తెరిచి....

దాతృత్యపు పార్వర్సాన్ని సృశించండి....


తెల్లవారితే కూడు దక్కదు....

పొద్దు వాలితే గూడు చిక్కదు...

కంటికి మింటికి ఏకధారగా కారే కన్నీటి సంద్రంలొ ఎన్ని ఉప్పెనలొ...!

గాయపడ్ద గుండెల్లొ గూడుకట్టిన ఎన్ని ఫెను తుఫానులొ....!

నిన్న తల్లి ఒడిలొ హయిగా ఆదమరిచి నిద్రపొయిన చంటి వాడు...

నేడు కంటికి కూడ కానరాని దూరతీరాలకు తరలిపొయిన తల్లిని తలంచుకుంటు...

ముంజేతులతొ కన్నులు తుడుచుకుంటూ...

ఏ అరుగు మీదనొ....అనాధలా నిద్రపొయే పరిస్ధితి...

ఆర్ధిస్తొంది దీనంగా... అదుకొండి మనసారా....!


తిలక్ గారు అన్నట్లు.....

ఆ రొజుల్ని తలంచుకున్నప్పుడల్లా ఆనందం లాంటి

విచారం కూడ కలుగుతుంది....

నేటి హేమంత శిధిల పత్రాల మధ్య నిలిచి....

నాటి వాసంత సమీర ప్రసారాల తలచి...

ఇంతే కధా జీవితం అన్న చింత....

ఇంతలొనే ముగిసిందన్న వంత....

చెమ్మగిల్లిన నాకళ్ళును చెదిరిన నా మనస్సుతొ....

ఇటు తిప్పుకుంటాను... ఎవరైన చూస్తారేమోనని....


"కమ్మరి కొలిమి... కుమ్మరి చక్రం...

జాలరి పగ్గం... సాలెల మగ్గం...

శరీర కష్టం స్పూర్తింపజేసే గొడ్డలి... రంపం... కొడవలి... నాగలి...

సహస్రవృతుల సమస్త చిహ్నలు....

నా వినుతించే... నా విరుతించే... నా వినిపించే...

నా విరిచించే నవీనరీతికి... భావం.. భాగ్యం.. ప్రాణం... ప్రణం...

అని ప్రస్పూటించిన మహకవి వాక్కులు అక్కడ నేడు తెల్లబొయాయి..."


జిల్లాలు ఎల్లలు దాటి... సముద్ర తీరాన చేరి ....

సాగర గర్జనే నమ్ముకుని బ్రతికే వారేందరినొ ఆ సముద్రమే

నిర్దాక్షణ్యంగా కబళించేసింది....

ఇలా ఎందరవొ ఒంటరి బతుకులు...

మరెన్నొ గుండెల్లొ ఆరని చితులు....

బతుకు వారికిప్పుడు సమరం....

కాస్తంత మన సహయమే వారికి కొండంత ఉపకారం....


అద్దం ముందు నిలబడితే నా కంటి పాపలొ నీ ప్రతిబింబం కన్పిస్తుంది.....

నా గుండెను సృశిస్తే స్తబ్ధతకు ప్రతీకగా నీ పేరు ప్రతిద్వనిస్తుంది....

చిరుగాలిలొ చేతులూపితే నీ స్మృతి పరిమళం చుట్టుముడుతుంది....

నువ్వు నా చెంత నుంటే ఊహల వాతవరణం వేడెక్కుతుంది...

నీ జ్ఞాపకాలు తొడుంటే...నిన్న కన్న కల మరియు రేపు కనే కల నీదవుతుంది....

నీ చిరునవ్వుల వెలుగుంటే....ఎడబాటుల నిశేది అస్తమిస్తుంది....

రెప్పలలొ దాగిన కన్నీటికి నీ ఓదార్పుంటే....అంతరంగాలలొ దాగిన దిగులు ఆవిరవుతుంది...

మరి అణువణువునా నీవైనప్పుడు... నా ఆలొచనలే నీదైనప్పుడు...

నిద్రెలా వస్తుంది... రేయేలా గడుస్తుంది....నేస్తం...!



జీవితం ఒక సంద్రమైతే ....

అందులొ ఎగసిపడే అలలు నీ గురించి కన్న కలలే.....

నా అంతరంగాలలొ ఉప్పొంగే తరంగాలైతే....

అందులొ విచ్చుకున్న ఆలొచనలు నీ గురించి కన్న తలపులే....

నేస్తమా.....!

ఆరాధన భావమో... మరి ఆకర్షణ స్వభావమో తెలియదు కాని

విరబూసిన వెన్నెలలా నువ్వు కన్పిస్తే చాలు...

నా మది వికశించిన పుష్పమవుతుంది....!

జ్ఞాపకాల మధురమో....మరి నీరిక్షణ సుమధురమో.... తెలియదు కాని

కలబొసిన చిరునవ్వుతొ నువ్వు పలకరిస్తే చాలు...

స్వేచ్చయుత మయురిలా తనువు పులకరిస్తుంది....!

ఆశల ఊసులను మూటకట్టుకొని....

సమశయమనే పొరను చేదించి నిన్ను పలకరించాలని...

నీ మృదు మధుర మాటల ప్రవాహంలొ పాల నురగనై పరవశించాలని ....

మనసును దాగిన కొరిక ప్రేరేపిస్తుంది.... కాని

ఉవ్వేతున పొంగుతు వచ్చిన అలలు.... ఇసుక రేణువులను చూసి

తన్మయత్వంతొ మాటలు మరచి వెనుదిరిగి వెళ్ళినట్లుగా.....

నీ చెంత చేరే సరికి కంటపడని బిడియంతొ మాటలకు అడ్డుకట్ల వేస్తున్నాను ...

మౌనంగా మరలిపొతున్నాను....

ఎప్పటికైనా నీ దేహంతరంలొ ఒదిగిన హృదయ వీణను మీటి....

నీ గీతామృతంలొ నేనూ ఒక బిందువు కావాలనీ....

నీ చల్లని గాన ప్రవాహంలొ పల్లవిగా నిలవాలనీ ....

కల కాలం నీ స్నేహం కొసం పరితపిస్తూ......

నిశ్మబ్ధ మహ సముద్రంలా నీరిక్షిస్తాను....

 





అలలా సవ్వడితొ నిండిన సంద్రపు హాసాలను ఆస్వాదించగలను కాని నిన్ను సముద్ర హసినిగా అభివర్ణించలేను...

చీకటిని తరుముతూ హేమంతపు వెలుగు కిరణాలను ప్రసరించగలను కాని నిన్ను హేమలతగా సాకలేను...

మమతనురాగలతొ నిండిన తేజొదీపాన్ని విక్షించగలను కాని నిన్ను మమతగా పలకరించలేను....

ఆరాధనతొ నిండిన చల్లని చూపులలొ పవిత్రతా చేకూర్చగలను కాని నిన్ను పవిత్రగా ఆస్వాదించలేను....

నిశేదిలొ స్మరిస్తూ... ఎడబాటులొ శొధిస్తూ.. నీరిక్షించగలను కాని నిన్ను ప్రియగా ప్రాణం పొయ్యలేను....

పదాలను పువ్వులుగా కూర్చగలను కాని నిన్ను పద్మగా పిలవలేను ......

సాహిత్య సుమాలలొ నృత్యరీతిలేన్నొ సాక్షాత్కరించగలను కాని నిన్ను రంభగా రచించలేను....

ఒదిగి పారే నదిలొ ఒంపులను స్వాగతీంచగలను కాని నిన్ను ఊర్వశిగా ఊహించలేను....

ఆరబొసుకున్న దృశ్యాలను తలపులలొ చూడగలను కాని నిన్ను మేనకగా మలుచుకొలేను...

ధారగా పడుతున్న గులాబి రెక్కలను తాకగలను కాని నిన్ను రొజాగా మదించలేను...

కలలలొని దూరతీరాలను భావంగా మలచగలను కాని నిన్ను కవిత గా కూర్చలేను...

స్వేచ్చయుత ఉదయ సంధ్యలా నీ రూపాన్ని కాంక్షించగలను కాని నిన్ను సంధ్యలా చూడలేను....

నీలి మబ్బుల ఓయ్యారి నడకలను చూడగలను కాని నిన్ను నీలిమ గా తలచుకొలేను...

వెన్నేలొ ఆడపిల్లని చూసి పులకించగలను కాని నిన్ను పున్నమిగా పరితపించలేను....

హృదయ గానంలొ రాగరంజితం చేయగలను కాని నిన్ను రాగిణి గా బంధించలేను....

ఊహల హరివిల్లులొ దారులన్ని స్వర్గంగా మార్చుకొగలను కాని నిన్ను ఊహ గా ఆరాధించలేను..

అందుకే

నా మదిలొ ఆత్మీయతతొ నిండిన నిన్ను "బంగారం" అని పిలుస్తున్నాను...

ఓ స్నేహితుడిగా జీవితపు కడవరకు నీకు తొడుగా నడవాలని ఆశపడుతున్నాను....



వెన్నెల కాసే అడవి అందాలను ఆస్వాదించాలని ఆశ...

పాటకు అందాన్నిచ్చె పల్లవి కావలని ఆశ....

సెలయెటికి సొగసులనిచ్చె ఓ అలలా బ్రతకాలని ఆశ....

మార్గం లేని జీవితాలకు మార్గదర్సకం కావాలనే ఆశ...

జాలువారుతున్న కన్నీటికి ఓదార్పు అవ్వాలని ఆశ...

అరవిరిసిన కుసుమ సుధను భ్రమరంనై ఆస్వాదించలన్న ఆశ...

జాలువారుతున్న స్వాతి చినుకును పుడమి తల్లినై దొసిలి పట్టాలని ఆశ....

ఉదయిస్తున్న సూర్యునికి తూర్పుని కావలని ఆశ....

విర్రవిగిన వెన్నెలకు శసినై హత్తుకొవాలని ఆశ.....

గానుగెద్దులా తిరుగుతున్నా కాలన్ని నా గుప్పెట్లొ బంధించాలని ఆశ....

తాపంతొ మత్తెకిస్తున్న ప్రకృతి కాంతను మంచు బిందువునై ముద్దాడాలని ఆశ....

హొయలతొ గుబులు పుట్టిస్తున్నా పులరాశులన్నింటికి పరిమళమై కమ్మెయాలని ఆశ....

నాలొ ఎన్ని ఆశలు ఉన్నా నన్ను కని పెంచిన తల్లిదండ్రులు....

నన్ను ఆశీర్వదీంచే నా గురువుల ఆనందాన్ని చూసి తరించాలని ఆశ...



నిరాశ నిస్మృహలతొ నేను నిస్తేజమైన వేళ...

వెన్నల చంద్రుడులా ఉత్సహన్ని నింపింది నీ పిలుపు....

వైణీకుడిగా నిష్పల ఎండమావులకై నేను పరుగులు తీసే వేళ....

సైలయేరై సేద తీర్చింది నీ తలపు....

ఆశయ సాగర మధనంలొ నేను అలసిన వేళ....

అమృత హస్తమై ఆదరించింది నీ వలపు....

జీవన వ్యూహంలొ దారులన్ని మూసుకుపొయిన వేళ....

ప్రస్పూటిస్తున్నా సౌధాల అడుగొడలని కూల్చింది నీ తీర్పు...

ఏకాంతంలొ అక్షరాలన్ని నన్ను అపరిచితుడుగా చూస్తున్న వేళ....

మౌనంలొ దాగిన భావాలకు ఆకృతినిచ్చింది నీ ఓదార్పు....

ఉప్పొంగే అంతరంగాలల్లొ నా గమ్యం దిశ కొల్పొయిన వేళ....

నా బాటలొ జీవానంతర పరిమళాలు వెదజల్లింది నీ రూపు....

నా ఖండాంతర జ్ఞాపకాలన్ని జల సమాధి అవుతున్న వేళ...

ఆశగా అంతరాలను మెల్కొపింది నీ చల్లని చూపు.....

నేను నమ్మిన ఈ లొకం నన్ను ఒంటరిని చేసిన వేళ....

"నీకు నేనున్నాను నేస్తం" అని అప్యాయంగా ఆహ్వనించింది నీ హృది తలుపు....

అందుకే నేస్తం నీ వ్యక్తిత్వానికి నేను అంకితం....


నా కళ్ళ అంతరాల్లొకి తొంగిచూస్తున్న నీ చూపుల సవ్వడేమిటి ... !

నా సందిగ్ధ తలంపుల వెనుక దాగి ఉన్ననీ ఆకర్షణల సత్యమేమిటి ....!

నా రెప్పల దుప్పటి కప్పుతున్న చీకటిలొ చిక్కుకున్న నీ కలల కాంతేమిటి...!

నన్ను నేనే కనలేని నీర్లిప్తంగా కరిగిపొతున్న ఈ మనసేమిటి....!

నా నిశి రాత్రి నడకలొ కడతెరని నీ బహుదూరపు గమ్యమేమిటి....!

నా వెచ్చని కన్నిటిలొ జారిపొతున్న నీ జ్ఞాపకాల సుడులేమిటి....!

నా తనువును చింద్రం చేస్తూ తరుముతున్ననీ తీపి తలపుల సంగతేమిటి....!

సాహిత్య సుమలు చిందే ఈ చంద్రుడు మదిలొ నీ నిరాశ మంటల వెన్నెలేంటి....!

నా శరీరపు మాయ పొరల వెనుక నీ మోహపు అలలా అలజడులేమిటి...!

నా జీవన వధనంలొ కలత పొందిన నీ ఆలొచనల వేదనేమిటి...!

నా చిరునవ్వుల సంద్రంలొ కలచివేస్తున్న నీ ఆశల ఎడబాటుల ఉనికేమిటి....!

శాపంగా నలిగిపొతున్న నా ఆత్మీయపు భావాలకు నీ ఉద్వేగపు ఊపిరేమిటి.....!

నా గతంలొ గనీభవించిన కన్నీటి మనుగడలొ నీ తేజొ దీప లావణ్య రూపమేమిటి....!

గుండె లొ బాధను చూసి మౌనంగా వర్షించే నా నులివేచ్చని కన్నీటికి నీ ఓదార్పు ఏమిటి....!




మనం మౌనంగా గడిపే ఆ నిమిషాల్ని నేను ప్రేమిస్తాను....

కబుర్లు చెప్పుకుంటు మనం కలిసి ఉన్న గంటలను నేను ప్రేమిస్తున్నాను...

ఊరికే కలలు కంటు మనం వెచ్చించిన కాలాన్ని నేను ప్రేమిస్తున్నాను....

చేయీ చెయి కలుపుతూ మనం కలిసి నడిచిన ఆ అడుగులను నేను ప్రేమిస్తున్నాను...

హృదయ తంత్రుల్ని సవరించే పువ్వులా సుతారంగా మీటిన నీ స్పర్సని నేను ప్రేమిస్తున్నాను...

బ్రతుకు వాకిట అనుభూతుల హరివిల్లుగా విరబూసిన నీ చిరునవ్వులను నేను ప్రేమిస్తున్నాను...

జీవితాంతం మరపురాని మదుర సృతులైన నీ జ్ఞాపకాలను నేను ప్రేమిస్తున్నాను....

నన్ను విడి వెళ్ళెటప్పుడు మధన పడుతు కార్చిన నీ కన్నీటిని నేను ప్రేమిస్తున్నాను....

ప్రేమను వ్యక్త పరుస్తూ మనం గడిపిన ఆ సమయాన్ని మరి మరి ప్రేమిస్తున్నాను....


ఏకారణం చేత నీవు నాకు దూరమైనా....

నీ మూలంగా వేదనకు చేరువయినా....

విడువదు నా మది నిన్ను తలుచుట....

మరువదు యద నిన్ను పిలుచుట....

కాలం ఆగకున్నా..... నీవు రాకున్నా....

ఎదురు చూచుటే ఈ బ్రతుక్కి అలవాటు ప్రియా....!



నిత్యం నీ చిరునవ్వుల తొలకరిలొ జారి పడే ముత్యాలకై


నేను ఏదురు చూస్తుంటే....

నీవు నన్ను దిక్షించకని ప్రతి సారి

నన్ను పవనం లా తాకి వెళ్ళిపొతున్నావు....

అయినా నీకు నాదొక్కటే మనవి...

నీ ఆనంద ఉద్యన వనంలొ ముద్దాడే

పూలకు పుప్పెడినై నీ పెదవులకు అంటాలని ఉంది ప్రియా...!



వస్తానంటావు...!

మనసు వాకిలిలొ నిల్చుని

హృదయపు తలుపులు తెరిచి నీ రాకకై నీరిక్షిస్తుంటే....

నీవు రావు.....

వస్తానంటావు....!

గుప్పెడు నవ్వుల కొసం

నా మది వాకిలి ముందు నిలబడిన నిన్ను ఆహ్వనిస్తుంటే....

నీవు రావు....

కన్నీళ్ళుతొ నిండుకొని అంధకారంలొ ఉన్న నాకు

నీ ప్రతి ఆలొచన అంకితమిచ్చి

నా నవ్వుల చిరుగంటల గలగలలొ

నువ్వు జ్వలించే చైతన్య ప్రవాహమై

నాతొ కలిసి నడిచిన ఆ క్షణాలు గుర్తున్నాయా ప్రియా...!

;;