ఓట్టు ! నాకనిపిస్తుంది....
నన్నయ్య ఒక్కసారి అన్నయ్య అనుకున్నట్లు...
పెద్దన తాంబూలంలొ "తెలుగు వక్క పలుకులు" వెసుకున్నట్లు...
శ్రీ శ్రీ ఘాటుగా రెండు దమ్ములు లాగినట్లు...
చలం గడ్డాన్ని సవరించుకున్నట్లు...
విశ్వనాధ మన భాషకి తెగులు వచ్చిందటు గర్జించినట్లు...
ఒక సనాతన పరిమళం ఆవరించి తెలుగు నేల పులకరించినట్లు....
ఈ సంతొష సంభ్రమంలొ నా కళ్ళు చెమరినట్లు...
ప్రాంతీయ భేదాలు మరచి తెలుగొళ్ళంతా కలసి కట్టుగా చెయ్యెత్తి జై కొట్టినట్లు...
ఓట్టు ! నాకనిపిస్తుంది....
నా మోవికి తావి నీవైతే...
నా భావి కి దేవి నీవైతే...
నా జీవన నిర్మాణం లొ...
అనురాగం అంబరమైతే...
ప్రపంచన్ని పరిహసిస్తాం...
మన భవిష్యతుని పరిపాలిస్తాం...
నీ తలపున రేకులు పూస్తే...
నా వలపున బాకులు దూస్తే...
మరణానికి ప్రాణం పొస్తాం...
స్వర్గానికి నిచ్చెన వేస్తాం...
స్త్రీ జీతం లేని సంఘబానిస....
స్త్రీ ఏమైనా తన అంతిమ కర్తవ్యం
గరిట తిప్పటంగా చేసిన ఈ వంటిళ్ళను ధ్వంసం చేయ్యండి..
స్త్రీ గుండెల మీద కూర్చున్నది...
పురుషాహంకారపు పెద్ద పులి...
నీ పేరు వింటే నా కడుపు చెరువు...
నీ మాట వింటే నా గుండె బరువు...
నీ నవ్వు నా ప్రాణవాయువు...
నాకు జీవితకాలం వరం గా ఇవ్వు...
నా చితిలోని కట్టేలలా నా కవితలు...
నా కవితలలొనే నేను మండుతున్నాను...
నా కవిత్వం గురించి నన్నడకండి....
కర్షకున్నడగండి... కార్మికున్నడగండి...
కమ్మరినడగండి... కుమ్మరినడగండి...
వాళ్ళు చిమ్మే స్వేద చుక్కనడగండి...
అతడే నాకు మహ కవి....
"స్నేహమెంత పదునైంది?
నిన్నటి నిషాలొ ముంచెత్తి రేపటి స్వప్నాన్ని చూపిస్తుంది...!
స్నేహమెంత గడుసైంది?
కన్నుగీటి కవ్వించి కనబడకుండా పొతుంది...!
స్నేహమెంత తైలివైంది?
ఏడ్పించి... మురిపించి... లాలించి బాధని దూరం చేస్తుంది...!
స్నేహమెంత చురుకైంది?
యుగాలని... తరాలని మింగేస్తూ ... విశ్వమంతా సాగిపొతుంది...!
అస్దిత్వమైన అక్షరాలు ఎప్పుడు చిటికేస్తే అప్పుడు పలకవు...
వాటి గుండెల్లొ లీనమైపొతే తప్ప...!
అధరాలపై కదిలిపొయే అక్షరాలన్నింటికి అర్దలుండవు...
పైపై ద్వనులు తప్ప...!
కలం గొంతు తొ పదం కలిపే ప్రతి అక్షరం అంతం కాలేదు...
నాలా ఆర్ధమైపొతే తప్ప...!"
రమణియ రంజిత రాగ రవళులు పలుకు సుందర "విశాఖ"...
వినూత్న విలాస వినొద కేళికి వింతయగు సంతస శాఖ...
సాగర తిరపు చల్లగాలులు...సేద తీరు "ఉడా" వనపు విహరాలు...
కొరి పిల్చిన వారికి అమోఘ అండ... కొటి దండాలు మ్రోక్కు "అప్పన్న కొండ"...
కరిగిపొని గత స్మృతుల గళ్లీ "భీమిలి"...
కొండ కొనల సీమన కొలువైనది "కైలాసగిరి"... కొటి దేవతల నిలయమై ప్రభవించింది సిరి...
పెక్కు మహనీయుల పుట్టినిల్లు... తక్కువ కావు వర్ణింప ప్రకృతి శొభలు...
సహృదుయుల కల్పతరువై గావుమాతల్లి "వెంగమాంబ"...వృద్దిలొ బుద్దిలొ సమృద్దిగా పెంచును "జగదాంబ"....
ఆకుపచ్చని అందాలు ఆరబొసుకున్నా దృశ్యాలు తలపుల్లొకి తరుముకు వస్తే...
పొగ మంచు జలతారు మేలి ముసుగులొ దొబూచులడుతూ నృత్యం చేస్తే....
వలిసే పూల సొగసులూ... వడిగా దూకే జలపాతాలూ... ఆవలిస్తున్న లొయలూ...
తొవ కనిపించని చీకటి సొరంగాలు...
ఒకసారి మిన్ను తాకుతూ... మరొ సారి మన్నును సొకుతూ....
ఎటు చూడలొ... వేటిని చూడలొ తేలియక....
ఓ సౌందర్య సమస్య ఉక్కిరిబిక్కిరి చేసి వేదిస్తుంది...
నా ప్రియ సఖి ప్రేమతొ పిలిచే పిలుపులా.....
ఈ విశ్వనికి పగలు ... రాత్రి...
నీ దయాదక్షిణ్యాల మీదేవస్తాయల్లే ఉంది ....
నీ నవ్వులొ వెలుతురూ....నీ కురులలొ చీకటి...."
దహించుకుపొతున్న హృదయం గుర్చి ప్రేయసి ముందు నీవేదనెందుకూ....!
రగిలిపొతున్న మనసు గుర్చిరాళ్ళముందు రాగాలేందుకు...!
తను వెలుగులొ ఉందొ ...
చికటిలొ వుందొ దీపమే చెప్పలేకపొతుంది.....ఇంక నేనెంతా
ఈ లొకం లొ అమితంగా ఇష్టపడేది నిన్నే ...
చీకటి జీవితానికి అలవాటు పడినవాడు ఒక్క సారే వెలుతురు చుస్తే
మొదట ఆనందం తరువాత ఆశ్చర్యం ఎలా కలుగుతుందొ...
అలానేనీ పరిచయం నాకు ఆనందాన్ని మరియు ఆశ్చర్యాన్ని కలిగించాయి...
ఏ శుభ సమయంలొ ఈ నా చికటి సామ్రాజ్యం లొ అడుగుపెట్టావొ తెలియదు కాని
నిన్ను నేను తలవని క్షణం లేదు... మనిషి నయితే వున్నాను గాని....
మనస్సు మాత్రంనీ చుట్టు తిరుగుతుంది....
నిజం నా ప్రాణం కంటే ఎక్కువ నా మనసాక్షి గా చెప్పుతున్నా
నాకున్న స్నేహితులలొ నీకున్న స్దానం అద్బుతం... అనంతం.....
నా గుండె ప్రతి చప్పుడు నిన్నే కలవరిస్తుంది...
నా కళ్ళు చూపే ప్రతి దృష్యం లొ కూడ నువ్వు నీ అందమైన నవ్వు కన్పిస్తుంది...
నీతొ వచ్చిన ఆనందం నీతొనే పొతే ఇంక నాకు మిగిలేది ఏమిటి?
నీ జ్ఞాపకం .... నా కన్నీరు....
ప్రకృతి ఆకు పచ్చని పట్టుచీరను తొడిగేసి పడుచు ప్రేయసి లాగ పలకరించేది....
సంధ్య రంగులు ఎన్నొ హత్తుకొని పెద్ద ముత్తయిదువల్లె ఎదురు వచ్చేది.....
ఎండినాకులు నేడు రాలుతున్నాయి...
వివశులైనా ఆ చెట్లు మౌనంతొ తల దించుకుంతున్నాయి....
నగ్నంగ నిలుచుండి తపియించె మునిలాగ వసంతమెపుడని నేడు ఎదురుచూస్తుంది....
తమ బాధ నాతోటి చెప్పుతూ నా గుండె మెత్తగా కోత కోస్తున్నాయి !!
"నవ వసంతం కొసం... నవ శుభొదయం..."
నిన్న దాచిన రంగుల చిత్రాన్ని రాత్రి మెల్లగా ఆవిష్కరిస్తోంది.....
మబ్బుల మగ్గాన్ని దూరాన మిణుగురు దండు తరిమేస్తుంది....
పక్షి గుంపులు ఆకాశంలో అక్షరాభ్యాసం చేసుకుంటున్నాయి....
పొగమంచు తెరలు తీసి ఉదయం చెరువులో ప్రకృతి తన రంగుల ముఖన్ని చూసుకుంటొంది.....
జోడెద్దులు గంటల శబ్దంతో వాటి అడుగులు కలుపుతున్నాయి....
కొమ్మ సందుల్లోనుంచి కిరణాలు గడ్డిమీద పచ్చరంగు పులుముతున్నాయి .... శుభొదయం
"బ్రతికిన నిన్నటిని ఆనందంగా గడిపితే
రాత్రికి పట్టిన ప్రశాంత నిద్రలోకమ్మని కలలా ముడులను విప్పగ
ఉదయించింది మరో ప్రపంచం నేటి శుభొదయం గా!!
నిట్టూర్పుల వేడి శ్వాసలు తగిలి ఇళ్ళముందు కళ్ళాపులు ఆరుతున్నాయి....
ఆతృత అధికమయి నుదుటి బిందువులు దాని ఆశలా జారి పచ్చగడ్డి మీద చేరుకున్నాయి....
సూర్యుడు రాకుండ పోడు .....చీకటి రాత్రినతను మింగకా పోడు...." శుభొదయం" !!
రాత్రి నల్ల చీర కట్టినా....పగలే అవుతుంది...
బందీ అయిన కాలం గానుగెద్దులా తిరుగుతుంది....
ఒంటరితనం లో రెండూ ఒకటే ...గడియారంలో...
మనిషిని మనుగడను గుర్తుకు తెస్తుంది....
నా మనసు బంగారు గని తవ్వేది నేనే అయినప్పుడుమిగలని నాకు బంగార(రవి)మెందుకు?
అందుకేగుడ్డివాడి గుండెల్లో సూర్యోదయం కొసం కావాలి ఈ శుభొదయం....
మనసు కొండ మీది మందారాన్ని పూజ వస్తువుగానే పొదువుకున్నాను...
నిరీక్షణలో కరిగిపోయిన కాలాన్ని నీరాజనంగానే అద్దుకున్నాను...
నిన్ను కోరిన మది మధనపాటును ప్రసాదమంటూ సమాధానపడ్డాను...
తపన మిగిలిన తడికన్నులను నిర్మాల్యమని తృప్తిపడ్డాను...
మాటల గారడీలో పెదవుల వెనక నలిగిన నిజాలనూ...
ఎదురు చూసిన రెప్ప మాటున ఆవిరయిన ఆశ క్షణాలనూ...
గుండె గుడిలో వెలిసిన దేవతకు మంగళహారతి అనుకున్నాను...
కాని నీ చూపు తో మీటిన నా హృదయతంత్రులని సవరించేదేవరూ...!
లోతులను తెలుసుకునే విలొకనం నీకుంటే కన్నిటి బొట్టులో కడలి ఉన్నది చూడు...
దిక్కులను కొలిచే ద్రుక్పధం నీకుంటే పొడి ఇసుక కణం లో పుడమి ఉన్నది చూడు....
భాషను అర్చించే పిపాసయే నీకుంటే బోసి నవ్వుల్లొ వడబొసి ఉన్నది చూడు.....
గమ్యమేదన్న జిఙ్ఙాసయే నీకుంటే ప్రతి మైలు రాయి పై వ్రాసి ఉంటుంది చూడు...
గుర్తింపు లేదనే ఆర్తి నీకుంటే గుండేలో గాయల దండ ఉన్నది చూడు....
కరుగుతున్నాననె కలత నీకుంటే మండుటెండన మంచుకొండ ఉన్నది చూడు...
ఏవరు వైతాళికులు అన్న ప్రశ్న నీకుంటే కొసరేయిలో కోడి కూత ఉన్నది చూడు....
బ్రతుకులను చదివే నిశిత బుధ్ధి నీకుంటే గుండె గుండెకు కత్తికోత ఉన్నది చూడు.....
రెప్పక్రింద కాష్టమై మిగిలిన ప్రేమ...
కనపడని విధి కాలడ్డంపెట్టిన కలయిక...
జ్ఞాపకాలు శ్వాశిస్తూ ప్రస్తుతానికిచ్చే తర్పణలు...
త్యాగాల కొమ్మకి వ్రేలాడే నిరాశ తల అది...
కనబడటంలేదా ?ఓడి తెగిన కంఠం నుంచి కారే ఆశ మడుగులు...
కనబడటంలేదా ?గుండెలో దిగిన బాకు...
పిడి నగిషీల వర్ణన ఎంతకాలం..?
కాళ్ళక్రింద రేగిన నేలతడుపు...గంధాల వర్ణన ఎంతకాలం..?
పిలిచి పిలిచి నా నాలుక ఎండిపొతున్నా...
ఎదురు చూసిచూసి కళ్ళు రంగుమారుతున్నా...
శ్వాస బదులు నిట్టూర్పులు సెగలు రేపుతున్నా...
ఈ కంటిలో జీవం ఏ గుండె కు చేరదు !!
మనసు తవ్వి నీ జ్ఞాపకాలు పూడ్చి త్యాగమనే గెలుపు ఫలకలను తగిలించి...
నా ఆశను నీళ్ళతో అభ్యంగన మాడించి గుండె పెంకుల్లో నా ముఖం చూడలేను...
ప్రణయమని పగిలి మిగిలేకంటే అహంతో గద్దించి గెలవడమే నాకిష్టం...
మొండి ప్రేమలో దీపపు పురుగును కాలేను...
ప్రణయమని కరుగుతావో.. ప్రక్షాళితమవుతావో... నీ ఇష్టం...
చూపులు కలిసిన ప్రతిసారీ పెగలని పదాలు పెదవుల మాటునే కరిగి ఆవిరైపొతున్నాయి....
జారిపోయే క్షణాలు రెప్పల వెనక తిరుగుతాయే కానీ చెక్కిళ్ళపై చేరిన బరువును మాత్రం దించలేకపొతున్నాయి....
అసత్యపు జీవిత ముసుగులో ముఖం దాచేస్తున్నాయి...
నిన్ను మరిచానన్న నమ్మకం నీకు కలిగించడం కోసమేనేమో...
ఈ అసంకల్పిత స్పందన !
నిప్పును మ్రింగి వెన్నెల కురిపించే ఆ చందమామదీ ఇదే కధేమో ...
నేను నిన్ను మరచాను !! కానీ... నువ్వే .... ప్రతిక్షణం..ప్రతి ఒక్క క్షణం.. గుర్తోస్తున్నావు !!
కంటి తడిలాగానో.. కవితా శకలంలాగానో !!
మొక్కలకు తొలి చిగురులు తొడగమంటేఅంతులేని ఆనందంతొ వసంతాన్ని మెల్కొల్పుతాయి...
మంచు పొద్దులొ లతల తలలను నిమిరితే అవిపట్టరాని పారవశ్యంలొ స్వప్న భాష్పాలను రాలుస్తాయి....
ఉల్లిపొర లాంటి ఈ హృదయాన్ని మీటగలిగితే...
శృతిమయ కృతులై సప్త జీవనానికి సొపానాలవుతాయి...
నిన్ను చూడగానే సన్నజాజుల సముద్రం ముంచెత్తినట్లు....
పూలరాశుల పరిమళం కమ్మేసినట్లు...
మనసు ఓ తియ్యని అనుభూతి....
నీ భావన విహంగానికి నా కనురెప్పలే రెక్కలన్నావు...
నీ ఆలొచన తరంగానికి నా చిరునవ్వులే మువ్వలన్నావు...
నీ జీవన కధనంలొ పల్లవించే మాధుర్యాలే నా పదాలన్నావు...
నీ బాధల అగాధాల్లొ కదలాడే నీడలే నా కన్నీళ్లన్నావు....
అందుకే నన్ను ఓ గీతంగా నిలిపావు...!
అనుభవాలను కూర్చి కవితగా మలిచావు...
నీ ఓర చూపులు... నీ తేనె పలుకులు... చూసిన తరువాత
నీకూ... నాకూ..."డెబిట్" .."క్రెడిట్" లు సరిపొతాయనిపించింది...
అందుకే ముందు ప్రేమకిఇ... ఆ తరువాత పెళ్ళికి ఒప్పిద్దామని
"ట్రయిల్ బ్యాలన్స్" వేసి చూసాను... ఆశ్చర్యం... కచ్చితంగా "టేలీ" అయింది...
పనిలొ పనిగా లాభనష్టాల ఖాతా కూడ వేద్దామనుకున్నాను... కానీ....
"లవ్ లాస్" వస్తుందేమోనని భయపడిపొయాను...దాన్ని తట్టుకొనే శక్తి నాకు లేదు...
కాలేజీ లొని... బయట ఇన్నాళ్ళు సొంత వ్యాపారిలా బ్రతికాను...
కాని నీ ప్రేమ లభిస్తే..."పాటనర్-షిప్" లొకి మారాలని నా మనసు ఊవ్విళ్ళూరుతొంది....
ఈ బిజినస్ లొ నీ పెట్టుబడి ఏమిటొ తెలుసా? ఓన్లీ నీ చిరునవ్వు....
అదే నీ వైపునుండి మూలధనం...ఇక మన "పాటనర్-షిప్" అరమరికల్లేకుండా
సాగిపొవాలంటే మన బిజినస్ సీక్రెట్స్ ఎవ్వరికి చెప్పకూడదు...
మన ప్రేమకి విశ్వాసం.. అనురాగం రొజు రొజూకి పెరగాలి గాని "తరుగుదల" మాత్రం ఉండకూడదు...
ఇద్దరికి వర్తించే ఈ "షరతులకు" నా వైపు నుండి నేను సిద్దం... నువ్వు కూడ ఓకే అంటే...
మన అనుబంధాన్ని "హిందు భాగాస్వామి" చట్టం ప్రకారం "మూడు ముళ్ళతొ" రిజిస్టరు చేద్దాం...
ప్రస్తుతం నా అంగీకారాన్ని మా "బ్రాంచి" ఆఫీసు తరుపున నీకు పంపుతున్నాను...
నీ ఆమోదాన్ని పాస్ చేస్తే "హెడ్ ఆఫీస్" కి ఎండార్స్ చేయ్యవచ్చు...
ఈ ఒప్పందాన్ని సవరించి క్రొత్త ప్రతిపాదనలు చేసే పవర్ నీకుంది...
మన మధ్య మధ్యవర్తి ప్రసక్తి రాకూడదని వేరే చెప్పక్కర్లేదుగా...!
నీ అంగీకార పత్రాలకై ఎదురు చూస్తూ.... నీ భాగస్తుడు...
ముక్కలయిన నా హృదయం లొ...లెక్కలేనన్ని నీ రూపాల వెలుగును చూడు...
పగిలే నీ తలపుల గాయంలొ వేదనతొ రగిలిపొతున్న నా గుండెలొ రుధిరాలను చూడు...
అశ్రువులతొ నిండిన కుండలగా మారిన కాంతి లేని నా గాజు కనులను చూడు...
రాలిపొయే ప్రతి కుసుమం కరిగే కాలానికి ఆనవాళ్ళుగా మార్చిన నీ ఎడబాటుల సంద్రం చూడు..
కనిపించని సుడిగుండాలలొ కలుసుకొని ఎడుతీరల మధ్య ఎగసే నీ పరిచయ ప్రవాహలను చూడు....
నీ పిలుపు తొడుగా లేకపొయినా నీ వలపునే నీడగా అల్లుకున్న నా జ్ఞాపకాల లతికలను చూడు...
నాకంట కన్నీరే... నీకంట పన్నిరుగా మార్చిన నా అంతరంగాల విధి వైపరిత్యాన్ని చూడు...
ఎండమామి నీరు త్రాగి... గుండే మంటలార్పుతున్న నా అధరాలా ఆత్రుతను చూడు...
పెంచుకున్న నా అంతరాత్మ ఆశల నడుమ నీ నీరాశ స్వాగత హస్తాన్ని చూడు...
నీ గతం మనే ఆశల నదిలొ ప్రస్తుతం మనే కాలపు నావ పై సాగుతున్న ఈ నిశేది బాటసారిని చూడు....
స్నేహమిదని మభ్య పెట్టుకుంటూ నువ్వు నేస్తమని సద్ది చెప్పుకుంటున్నా....
గుండె గుడిలొ దాచుకుంటున్నా...అందుకే.....
నీకై వేచిన ఆ ప్రతి క్షణాన్ని నేచేసిన కాలక్షేపమనుకుంటున్నా .....
స్థంభించినా సమయంలో రాలిని ఆరెండు చుక్కలు కాకతాళీయ మనుకుంటున్నా....
నువ్వు కనపడనప్పుడు మెలికలు తిరిగిన మనసును వెర్రి తనమని సమాధానపడుతున్నా....
బరువు పెరిగిన ఆ రెప్పల భారంను అనాలోచిత మనుకుంటున్నా....
నీ మాటకోసం పడె ఈ గుండె తపనను పిచ్చితనమని పెదవి విరుస్తూన్నా....
నా మాటల గారడీలో నలిగిన నిజాలాను ఆశ నివేదనలనుకున్నా....
ఎదురు చూపుల్లో ఎండిను రెప్పలను రాలకుండా సంభాళిస్తున్నా....
ఒంటిచేతి చప్పట్లకు ఆవురావురని ఎగిరొచ్చే ప్రతిధ్వనులని ఆస్వాదిస్తున్నా ....
చెమరిన కన్నుల చిత్తడినార్పగ...
చెదిరిన గుండెల ఆర్తిని తీర్చగ....
వేచిన మనసుకు విడుదల నేర్పగ....
కరిగిన యెడదకు కఠినత చేర్చగ....
విరిగిన తలపుల పొందిక కూర్చగ....
ఆర్తిగ అరిచిన గొంతును తడపగ....
కర్తను నెనై చెసిన తప్పుకు క్రుంగిన మనిషిగ చెతులు చాపగ .....
కరుణను చూపే నీ కన్నుల చూసిన నెచ్చెలి విలువను ఎంతని చెప్పను నేస్తం !?
వయసు కేంద్రం...భవిత ఇంధనం...
జ్ఞాపకాల తరుగు...ఆశల దిగులు...
బంధాల మోతలు...అనుభవపు మిగులు...
బాధ కుదుపులు....జీవితం సంసయం...
బ్రతుకు చక్రం.....విధి పయనం !
జారిపోతుంది ప్రస్తుతం దృశ్యమాత్రంగా...
ఏది స్థిరం ?
కరిగిపొయింది గతం కాలచక్రంగా...
ఏది జ్ఞాపకం?
మరి నా పయనమెక్కడికి ?దేనికోసం ?
అన్నీ కరిగిపోయేవే.. .
చెరిగిపొయేవే...
కదిలిపోయేవే...
నిలిచి పోయేవే ...
మరి మిగిలిపోయేదేంటి....అంతా మిధ్య...
పగులుతున్న గుండెను నీకు చూపే సరికి
అజ్ఞానమనుకొని నవ్వుతున్నావు...
ముక్కలేరుకుంటూ మిగిలిపోయాను....!
రగులుతున్న మంటల్ని నీకు చూపలేక
గుండెల్లొ దాచేసరికి మొహమాటమనుకున్నావు..
మౌనంగానే మరలిపోయాను...!
నీ శతకోటి కోణాల సజీవ శిల్పాన్ని నేను
అయినా తెరమీద బొమ్మ గానే తడిమి చూస్తున్నావు...
అద్దం మీద ఊదిన దూళీలా ఆవిరవుతున్నాను..!
బాధతొ నా కనులలొ నువ్వు తవ్విన నీటి గుట్టలూ..
నన్ను నన్నుగా చూపలేక పోతున్నాయి..
చేతితొ కన్నీటిని తుడుచుకెళుతున్నాను ..
అందుకే నాకు నేనే అజ్ఞాతనవుతున్నాను...
ఇక నా పరిచయం ఏవరినడగ గలను....?