లోతులను తెలుసుకునే విలొకనం నీకుంటే కన్నిటి బొట్టులో కడలి ఉన్నది చూడు...

దిక్కులను కొలిచే ద్రుక్పధం నీకుంటే పొడి ఇసుక కణం లో పుడమి ఉన్నది చూడు....

భాషను అర్చించే పిపాసయే నీకుంటే బోసి నవ్వుల్లొ వడబొసి ఉన్నది చూడు.....

గమ్యమేదన్న జిఙ్ఙాసయే నీకుంటే ప్రతి మైలు రాయి పై వ్రాసి ఉంటుంది చూడు...

గుర్తింపు లేదనే ఆర్తి నీకుంటే గుండేలో గాయల దండ ఉన్నది చూడు....

కరుగుతున్నాననె కలత నీకుంటే మండుటెండన మంచుకొండ ఉన్నది చూడు...

ఏవరు వైతాళికులు అన్న ప్రశ్న నీకుంటే కొసరేయిలో కోడి కూత ఉన్నది చూడు....

బ్రతుకులను చదివే నిశిత బుధ్ధి నీకుంటే గుండె గుండెకు కత్తికోత ఉన్నది చూడు.....

0 Comments:

Post a Comment