ఆరు బయట చినుకుల వలే చీకట్లు...
కనులకొలనులలొ ఏవేవొ నిద్ర ఆవిరులు...
గది మూల నక్కి మూలుగుతూ...
ప్రవిదలొ చమురు త్రాగుతూ...
పలు దిక్కులు చూస్తూ...
అలసిన దీపం ఆకాశతారగా మారి ఆరిపొయింది....
ప్రకృతి బొనులొ చీకటి జూలు విదిలిన సింహం లా నించున్నది...
శశి ని కౌగిలించుకున్న వెన్నెలను చూసి రాకాసి రంకేలేసింది....
ఆ కేకల దాటికి విరుచుకు పడ్డాడు కత్తి గంటు మీద నెత్తుటి బొట్టులా భానుడు...."శుబొదయం"
0 Comments:
Subscribe to:
Post Comments (Atom)