మెరిపించిన కనులను పెదవి విరుపులు మరుగుకు నెడుతున్నాయి...
ఐనా ఈ తావు వీడలేను నేను..
నిశీధిలో కలిసిన మూగ నవ్వును తడి స్పర్శ తపనతొ ఆపుతున్నాయి ...
అయిన ఏ గంధమూ లేని మనసుగంధాన్నినేను...
రాలిన ప్రతి పువ్వూ విధి విదిల్చిన రంగువే అంటూ దెప్పుతుంది....
చివుక్కుమన్న ప్రాణం చిన్నబోతుంది....
అన్నీ నా కలల ప్రపంచంలో కరగని కధలే....
అలంకారానికీ కొరగాక ఆనందాలకూ పనికిరాకచావుకీ దూరంగా ఎందుకీ బ్రతుకు?
ఎవరికోసం ఆ నవ్వు.... ఆ స్పర్శ.....ఆ మమత..... ఆ ఆనందం....
నాకూ కావాలి మరుజన్మ కైనా సరే....
కానీ మరణమూ రాదుగా ఏందుకంటే కాగితం పువ్వును నేను...ఈ బ్రతుకింతే !!
1 Comment:
-
- పరిమళం said...
Monday, 07 September, 2009అద్భుతంగా రాశారు !
Subscribe to:
Post Comments (Atom)